పుష్కరాలరేవులో హ్యాపీ సండే

ఈ ఆదివారమే ఆరంభం : కమిషనర్ వెల్లడి 
commisssioner2commisssioner
     విజయవాడలో తలపెట్టిన హేపీ సండే కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం నగరంలో కూడా ఆరంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇకపై ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పుష్కరఘాట్‌ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, విద్యార్ధులకు క్రీడలు, తదితర  కార్యక్రమాలను హేపీ సండే ప్రోగ్రామ్ లో నిర్వహిస్తారు. ఈ ఆదివారం(23) శ్రీకారం చుడతారు. ఇందుకోసం   కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆసక్తి కలిగిన వారు స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని పాలక సంస్ధ కమిషనర్‌ వి.విజయరామరాజు చెప్పారు.  తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మేనేజర్‌ శ్రీనివాసరావు, శానిటరీ సూపర్వైజర్‌ నారాయణరావు లతో కల్సి శనివారం  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపు(23) ఉదయం 7 గంటలకు హేపీ సండే కార్యక్రమం మొదలవుతుందన్నారు. 
కాలవల్లో చెత్తవేస్తే జరిమానా ….
    మురుగు కాలువల్లో చెత్త వేసే వారి నుంచి రూ. 100 అపరాధ రుసుముగా వసూలు చేస్తామని కమిషనర్   తెలిపారు. ఇప్పటికే ఎన్నో సార్లు హెచ్చరించినా మార్పు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజల నుంచి అపరాధ రుసుము వసూలు చేయాలన్నది తమ ఉద్ధేశ్యం కాదని, కేవలం ప్రజారోగ్యం కోసమేనన్న విషయాన్ని గమనించాలన్నారు. రెండుమూడు రోజుల్లో అధికారికంగా ప్రకటన విడుదల చేస్తామన్నారు. కాగా నగరంలో శానిటరీ సిబ్బందిని అంతర్గత బదిలీలు చేశామని, దీనివల్ల పారిశుద్ధ్య నిర్వహణ కుదుట పడేందుకు పది రోజులు సమయం పడుతుందన్నారు. సెంట్రల్‌ జోన్‌లో పర్మనెంట్‌ కార్మికులు పనిచేస్తారని, మిగిలిన జోన్లలో తాత్కాలిక కార్మికులు విధులు నిర్వహిస్తారని తెలిపారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.