పోలవరం సందర్శించిన బిజెపి బృందం

   polavaram.3polavaram.4polavarampolavaram.2

పోలవరం ప్రాజెక్ట్ దగ్గర జరుగుతున్న పనులను పరిశీలించడానికి బిజెపి ప్రజా ప్రతినిధుల బృందం శనివారం రాజమండ్రి , పశ్చిమ గోదావరి జిల్లా మీడియా ప్రతినిధులను వెంటబెట్టుకుని పోలవరం సందర్శించింది. విశాఖ ఎంపి అయిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు , రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ , దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ పైడికొండ ల మాణిక్యాలరావు , బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు – ఎం ఎల్ సి శ్రీ సోము వీర్రాజు , రాజమండ్రి అర్బన్ ఎం ఎల్ ఎ డాక్టర్  ఆకుల సత్యనారాయణ , నరసాపురం ఎంపి శ్రీ గోకరాజు గంగరాజు తదితర బృందం పోలవరం , పట్టిసీమ ప్రాజెక్టుల ను పరిశీలించింది. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో డాక్టర్ హరిబాబు మాట్లాడుతూ   త్వరితగతిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తిచేయాలని కోరారు . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి ఈ విషయం  తీసుకెళ్ళామని ఆయన అన్నారు . పోలవరం ప్రాజెక్ట్ వస్తే , సాగునీటి ,తాగునీటి అవసరాలు తీరడంతో పాటూ విధ్యుత్ ఉత్పత్తి కూడా అవుతుందని ఆయన పేర్కొన్నారు. బిజెపి నాయకులు సర్వశ్రీ గరిమెళ్ళ చిట్టిబాబు , బొమ్ముల దత్తు , క్షత్రియ బాల సుబ్రహ్మణ్య సింగ్ , రేలంగి శ్రీదేవి ,తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.