పోలీసులపై ఆరోపణలు తగవు …

పోలీసు ఆఫీసర్సు అసోసియేషన్ ఖండన
పోలీసుల పై వైఎస్ఆర్ సిపి నాయకులు నిరాధార ఆరోపణలు చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ పోలీసు ఆఫీసర్సు అసోసియేషన్ రాజమండ్రి అర్బన్ జిల్లా యూనిట్ ప్రతినిధులు… తూర్పు గోదావరి జిల్లా పోలీసు అధికారుల సంఘం సంయుక్తంగా పేర్కొంటూ , వై.ఎస్ ఆర్. సి. పి. నాయకుల వైఖరిని ఖండించారు. ప్రకాష్ నగర్ పోలీసు స్టేషన్ పై వైఎస్ ఆర్ సిపి నాయకులు దాడి చేయడం సమంజసం కాదని అసోసియేషన్ అధ్యక్షులు ఎ.శ్రీనివాసరావు, అర్బన్ జిల్లా అసోసి యేషన్ యూనిట్ ఉపాధ్యక్షులు..బి.రాజకుమార్.. కోశాధికారి కె.బాల సత్యకుమార్… తూర్పు గోదావరి జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు జి.బ్రహ్మాజీ రావు, గౌరవ అధ్యక్షులు జి.బలరామమూర్తి, ఎన్. సత్యనారాయణ తదితరులు పేర్కొంటూ, ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.. అడిషనల్ ఎస్ పి పై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొంటూ , . ప్రైవేటు కేసులు ధాఖలు చేస్తామనడం ఎంతవరకూ సమంజసమో ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. . ఇలాంటి సంఘటనల ద్వారా పోలీసుల ఆత్మస్దయిర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని వారు ఆ ప్రకటనలో తెలియజేశా రు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.