ప్రజాకవి జాషువా

(నేడు  28వ తేదీ “కవికోకిల” జాషువా జయంతి సందర్భంగా….)

gurram

 తే. “వాణి నారాణి” యనె కవివరు డొకండు,
    “నను వరించెను శారద” యంటి వీవు,
    “దమ్ముగల కవిపుంగవుల్” సుమ్ము మీరు
    అందుకొనుడయ్య! మాదు జోహార్లు శతము.

తే. అయిదు తలల నాగేంద్రున కడలిపోయి
    దాని బుసలకు వసివాడు ధరణి గావ
    “గబ్బిలము రచియించితి వబ్బురముగ
    ప్రజల నాల్కల తిరముగ బ్రతుకు సుకవి!

సీ. “గిజిగాని గూ”డను గిలిగిలి తూ గుటు
         య్యాల గృహపుఠీవి నరసితెట్లు?
    “నెమిలి నెలత” కట్టిన మలిన వస్త్రంబు
          నామె పాతివ్రత్య మరసితెట్లు?
    ఆడు మగతనంబు లమరిన సాలీని
           జిలుగు నేతల నేర్పు తెలిసె నెట్లు?
    “బుజ్జాయి” దర్జాలు బొటవ్రేలి చొక్కును
            “శిశువు” వర్ణన నీదు వశమదెట్లు?
తే. అల్ల జాబిలిని “చెవుల పిల్లి”, గొల్ల
    భామ” యొయ్యార “మింద్రచాపంపుసొగసు,
    “శిల్పి” సల్పు సృష్టిరహస్య శిల్పజాల
    మింత నిశితంబుగా ప్రకృత్యంతరంగ
    శోధనము చేయు ఘనకవీశు డెవ డిలను?
    జాషువా! నీవుగాక! “విశ్వకవి” వీవు!

తే. “పచ్చిబాలెంతరాలని భరతమాత
    బొగడి “గడనకెక్కిన యాంధ్రపుత్త్రవర్య!
    “పద్మభూషణా!” జాషువా! ప్రథితకీర్తీ!
    అందుకోవయ్య! జన్మదినాంజలులను!

sv

   “ఆంధ్రశ్రీ”, “పద్యకవితిలక”, “సరసకవి”
     డాక్టర్. సంగాడి వీరరాఘవేంద్రరావు

About The Author

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.