ప్రపంచం గర్వించదగ్గ మహానటుడు అక్కినేని … prominent Telugu cinema actor Akkineni Nageswara Rao.

adabala maridayya.- akkineni vardhaniadabala maridayya

ప్రపంచం గర్వించదగ్గ మహానటుడు అక్కినేని 

3వ వర్ధంతి సభలో పలువురు నివాళి
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మభూషణ్, నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ప్రపంచం గర్వించ దగ్గ మహానటుడని పలువురు ఘనంగా నివాళుర్పించారు. అక్కినేని 3వ వర్ధంతి సందర్బంగా అక్కినేని వీరాభిమాని, రంగంపేట మండలం దొడ్డిగుంట వాస్తవ్యుడు శ్రీ అడబాల మరిడయ్య కాపు ఆధ్వర్యాన రాజమహేంద్రవరం వై జంక్షన్ ఆనం రోటరీ హాలులో ఆదివారం ఉదయం డాక్టర్ అక్కినేని వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. నటుడు గాయకుడు శ్రీ శ్రీపాద జిత్ మోహన్ మిత్రా, అక్కినేని అభిమాన సంఘం నాయకుడు ఏ ఎస్ ఆనంద్ ,అభిమానులు సర్వశ్రీ దొండపాటి సత్యంబాబు, నిమ్మలపూడి గోవింద్, వి జగపతి, కట్టా సూర్యప్రకాశరావు, కానూరి నాగేశ్వర రావు, చిట్టూరి వీరభద్రరావు, సూరిబాబు శర్మ , అల్లి వీర్రాజు, సీతారాం, ఎన్ భీమరాజు,వెలమర్తి గోపాలకృష్ణ, ఎం శేషగిరిరావు తదితరులు అక్కినేని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. డాక్టర్ అక్కినేనితో గల అనుబంధనాన్ని గుర్తుచేసుకున్నారు. రాజమండ్రితో అక్కినేనికి ఎంతో అనుబంధం ఉందన్నారు.
శ్రీ జిత్ మోహన్ మిత్రా మాట్లాడుతూ అందం, ఆహార్యం లేకున్నా తన నటనా చాతుర్యంతో అశేష అభిమానులను అలరించిన అక్కినేని నట జీవితంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారని, దేవాదాసు సినిమా చేసి, దిలీప్ కుమార్ నుంచి ప్రశంసలు పొందారని,అగ్రనటుడిగా ఉంటూ కూడా చిన్నచిన్న పాత్రలు కూడా వేశారని, దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని చారిత్రిక ప్రముఖుల పాత్రలు అంటే మహాకవి క్షేత్రయ్య, మహాకవి కాళిదాసు, అమర శిల్పి జక్కన్న,ఇలా ఎన్నో పాత్రలు పోషించిన ఏకైక నటుడిగా నిలిచారని పేర్కొన్నారు. బెంగాలీ రచయిత శరత్ చంద్ర రాసిన దేవదాసు నవల దేశంలోని 14భాషల్లో సినిమాగా వస్తే అందులో అక్కినేని చేసిన దేవదాసు అగ్రగామిగా నిలిచిందన్నారు. అప్పటికే హిందీ నట దిగ్గజం దిలీప్ కుమార్ దేవదాసు హిందీలో చేసారని, అయితే అక్కినేని నటన చూసిన దిలీప్ కుమార్ ఆశ్చర్యపోయి మీ నటన ముందు ఓడిపోయానని చెప్పారంటే అక్కినేని నటన ఎలాంటిది అర్ధం చేసుకోవాలన్నారు. అక్కినేనిని ఓసారి మీకు బాగా ఇష్టమైన పాత్ర ఏదంటే దేవదాసు కాకుండా బాటసారి సినిమా పేరు చెప్పారని ఆయన చెబుతూ, వాస్తవానికి బెంగాలీ కథ అయిన బాటసారి సినిమా చేయడానికి అక్కినేని అంగీకరించకపోతే సముద్రాల రాఘవాచార్య ఒప్పించి చేయించారని అన్నారు.
1957లో రాజమండ్రి పురపాలక సంఘం పక్షాన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రై చేతులమీదుగా పౌర సన్మానం చేసి, నట సామ్రాట్ బిరుదు ఇచ్చారని శ్రీ జిత్ పేర్కొన్నారు. ఆనాటి సభలో రాజకీయ , వ్యాపార ప్రముఖులు, ఆడిటర్లు ,న్యాయవాదులు, వివిధ రంగాల ప్రముఖులు వున్నారని చెప్పారు. తాము స్కూల్ విద్యార్థులుగా ఉండడంతో బయట నిలబడి ఆనాటి సన్మానం చూశామని చెప్పారు. నేను ఓసారి సన్మానం చేయడానికి ప్రయత్నిస్తే, ఒప్పుకోలేదని అయితే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చాక రాజమండ్రిలో షూటింగ్ కి వచ్చిన సందర్బంగా ఇక్కడ సన్మానం చేసే అవకాశం తనకు అక్కినేని కల్పించారని ఆయన గుర్తుచేసుకున్నారు.
“నాల్గవ తరగతి చదువుకున్న అక్కినేని తెలుగు బాగా నేర్చుకున్నారు, అలాగే ఓసారి శ్రీలంక వెళ్తే, అక్కడ అక్కినేని తెలుగులో మాట్లాడినపుడు ఇంగ్లీషు రాదని హేళన చేస్తే, దానికి అక్కినేని ఎంతో కుమిలిపోయారు, ఆతర్వాత చక్రపాణి చొరవతీసుకుని రోజూ హిందూ పేపర్ చదవమని చెప్పి, ఆంగ్లో ఇండియన్ ని పంపించి మరీ ఇంగ్లీషు నేర్పించారు. ఇక 1964లో విజయ టాకీస్ లో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకి సన్మానం జరిగింది. మహానటి సావిత్రి తదితరులు వచ్చారు. అక్కినేని కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులతో ఇష్టాగోష్టి ఏర్పాటుచేస్తే అందులో దాదాపు 45నిమిషాల సేపు అనర్గళంగా అక్కినేని ఇంగ్లీషులో మాట్లాడారు. ఇది విన్నవాళ్లంతా అనుమానం వచ్చి స్టేజి వెనుక టేప్ రికార్డర్ పెట్టరేమోనని వెతుకున్నారు. ఇది నిజం. ఆవిధంగా ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించిన అక్కినేని ఆతర్వాత పలుదేశాల్లో వాణి విన్పించారు. అంతటి పట్టుదల గల నటుడు అక్కినేని” అంటూ జిత్ వివరించారు.
“అక్కనేని 78మంది హీరోయిన్లతో నటించారు. నిర్మాత బాగుండాలని కోరుకుని అందుకనుగుణంగా వ్యవహరించిన నటుడు ఆయన. దేవదాసు వంటి చిత్రాలు నటించినా ,మిస్సమ్మ లాంటి చిత్రాల్లో తక్కువ నిడివిలో హాస్య పాత్రలో కూడా నటించడానికి అంగీకరించి మెప్పించిన నటుడు అక్కినేని. గుడివాడ కాలేజీకి లక్ష రూపాయల విరాళం ఇవ్వడంతో పాటు ఆంధ్ర యూనివర్సిటీ తో పాటు మరో విశ్వ విద్యాలయాలకు ఆరోజుల్లో 25వేల రూపాయల చొప్పున భూరి విరాళం ఇచ్చారు. తాను చదువుకోకపోయినా అందరూ చదువుకోవాలన్న తపనతో ఈవిధంగా చేసారని, ఆయన ఇచ్చిన విరాళంతో ఈనాటికీ చాలామందికి స్కాలర్ షిప్స్ ఇస్తున్నారు. దటీజ్ అక్కినేని” అని శ్రీ జిత్ చెప్పారు.

      నిమ్మలపూడి గోవింద్ మాట్లాడుతూ 2006లో  డాక్టర్ అక్కినేనితో పరిచయం కావడం తన అదృష్టమని, ఇక అప్పటినుంచి ప్రతియేటా అక్కినేని పుట్టినరోజుకి గంగరాజు కోవా పంపడం రివాజు అయిందని చెప్పారు. స్వయంగా అక్కినేని ఫోన్ చేసి తనతో అలాగే తన కుటుంబ సభ్యులతో మాట్లాడేవారని గుర్తుచేసుకున్నారు. హోటల్ షెల్టాన్ లో తాను , జిత్ , మరిడయ్య కాపు దాదాపు గంటసేపు అక్కినేనితో మాట్లాడుకునే అవకాశం దక్కిందని అయితే అప్పుడు ఫోటో తీయించుకోవాలనే స్ప్రహ కూడా లేదని అదే బాధ పడుతుంటామని చెప్పారు.  శ్రీ ఏ ఎస్ ఆనంద్ మాట్లాడుతూ 4 దశాబ్దాలు అక్కినేని అభిమాన సంఘ నాయకుడిగా వున్నానని, అభిమానులను ఎంతో ఆప్యాయంగా చూసేవారని చెప్పారు. ఎన్నో సంస్థలకు అక్కినేని సహకారం అందించారని చెప్పారు. అభిమానులు బాగుండాలని కోరుకుంన్నారని గుర్తుచేసుకున్నారు. శ్రీ సత్యంబాబు మాట్లాడుతూ అక్కినేని అభిమాని అయిన తాను జిత్ చొరవతో హైదరాబాద్ లో అక్కినేని ఇంటికి వెళ్లి ముచ్చటించే అవకాశం వచ్చిందన్నారు. ఆరోజుల్లో ఎన్ టి ఆర్ , ఏ ఎన్ ఆర్ సినిమాలు పోటాపోటీగా వుండేవని, రాజమండ్రిలో అభిమానుల మధ్య గొడవలు కూడా జరిగేవని గుర్తుచేస్తుకున్నారు. 

    శ్రీ మరిడయ్య మాట్లాడుతూ ఆరోజుల్లో ఎన్ టి ఆర్ , ఏ ఎన్ ఆర్ సినిమాలు పోటాపోటీగా వచ్చేవని, ఎక్కడ అసభ్యతకు తావులేకుండా అక్కినేని తన పాత్రలతో చిరస్మరణీయం అయ్యారని పేర్కొన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స ఎలాగో ఎన్నో భాషల్లో దేవదాసు సినిమా వచ్చినా అక్కినేని దేవదాసు మిన్న అని శ్రీ మరిడయ్య పేర్కొన్నారు.

 

 

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=akkineni%20nageswara%20rao

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=raghaveeyam

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv%20raghavrao

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=jit%20mohan%20mitra

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.