‘ప్రబంధ కవుల తిరుమల దర్శనం’ ఆవిష్కరణ

bspbsp1bsp2

  శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం విశ్రాంత తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య గార్లపాటి దామోదర నాయుడు విరచిత ‘ప్రబంధ కవుల తిరుమల దర్శనం’ గ్రంధావిష్కరణ సభ రాజమండ్రి ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాలులో ఆదివారం ఉదయం నిర్వహించారు. శ్రీ పందిరి మల్లికార్జున రావు స్మారక గ్రంధావిష్కరణ సాహిత్య సభ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎస్ కె విటి డిగ్రీ కాలేజీ తెలుగు శాఖాధ్యక్షులు డాక్టర్ అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు అధ్యక్షత వహించారు.
డాక్టర్ బిక్కిన రామమనోహర్ ఈ గ్రంధాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ ప్రభల సుబ్రహ్మణ్య శర్మ గ్రంధ సమీక్ష చేసారు. డాక్టర్ అరిపిరాల నారాయణరావు పర్యవేక్షించిన ఈ కార్యక్రమంలో సర్వశ్రీ పెరుమాళ్ళ రఘునాధ్ , డాక్టర్ డి ఎస్వీ సుబ్రహ్మణ్యం , పాత్రికేయులు వి ఎస్సెస్ కృష్ణకుమార్ , ఎస్బీ చౌదరి , డాక్టర్ మురళీకృష్ణ , దినవహి వెంకట హనుమంతరావు , మరా శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రంధ రచయిత., సమీక్షకులను సత్కరించారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.