ప్రశ్నించే పవన్ ఎందుకు నోరు మెదపడంలేదు

ఫిరాయింపుదారులకు అమాత్య పదవులపై ప్రశ్నించిన దుర్గేష్

durgesh
ఈ మధ్య కాలంలో పలు సమస్యలపై నేను సైతం అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్, తాజాగా ఏపీలో ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేసినా ఎందుకు స్పందించడం లేదని రాజమహేంద్రవరం గ్రేటర్ వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్‌ సూటిగా ప్రశ్నించారు. ప్రశ్నించడానికే ఏర్పడిన పార్టీ…రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరం జాంపేటలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ సిటీ కో -ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రూరల్‌ కో-ఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర సేవాదళ్ ప్రదాన కార్యదర్శి సుంకర చిన్ని,పార్టీ రాష్ట్ర నాయకులు దంగేటి వీరబాబు, నక్కా రాజబాబు, పార్టీ కార్పొరేటర్లు పిల్లి నిర్మల, మజ్జి నూకరత్నం, ఈతకోట బాపన సుధారాణి, పార్టీ నాయకులు గట్టి నరసయ్య తదితరులతో కలిసి ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు.
అయారాం గయారాం వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చారంటూ శ్రీ గోరంట్ల బుచ్చయ్యచౌదరి వంటి సీనియర్‌ తెలుగుదేశం నాయకులే బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారని శ్రీ దుర్గేష్ పేర్కొంటూ పవన్ కళ్యాణ్ మాత్రం నోరు మెదపకపోవడం దారుణమని అన్నారు. గత ఎన్నికలలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున గెలిచి టిడిపిలో చేరిన 21 మంది శాసనసభ్యుల్లో నలుగురికి చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటు కల్పించడంపై అన్ని పార్టీలు బహిరంగంగానే తమ నిరసనను తెలియజేసారని అలాగే,చివరకు చంద్రబాబుకు సన్నిహితుడైన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సైతం ఆయన మనసులో ఎలా ఉన్నా పార్టీ మారే వారు శాసనసభ్యత్వానికి రాజీనామా చేసే మరో పార్టీలో చేరాలని బహిరంగంగానే పరోక్షంగా చంద్రబాబు చర్యను తప్పుబట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే రాజకీయాల్లో కుళ్ళును కడిగేస్తానని అప్పుడప్పుడు మీడియా సమావేశాల ద్వారా, ట్విట్టర్‌ ద్వారా స్పందించే పవన్‌కళ్యాణ్‌ ఎందుకు ఈ పరిణామాలపై స్పందించడంలేదని దుర్గేష్‌ ప్రశ్నించారు. పవన్‌కళ్యాణ్‌ పవర్‌స్టార్‌గా మాట్లాడితే తాము ప్రశ్నించబోమని, అయితే ఓ పార్టీ అధినేతగా పవన్‌కు చంద్రబాబు చర్యలు తప్పుగా కనిపిస్తున్నాయో లేదో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. పవన్‌కళ్యాణ్‌ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ పార్టీకి ఉపయోగపడుతున్నాయన్న విషయం ఆయన మౌనం ద్వారా రుజువవుతున్నాయన్నారు. చంద్రబాబు చర్యలు ఆయన పార్టీ అంతర్గత వ్యవహారాలు అయితే ఎవరూ పట్టించుకోరని, అయితే ఆయన రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పుడు, సార్వభౌమత్వానికి విఘాతం కలిగిస్తున్నప్పుడు ఎవరైనా స్పందిస్తారన్నారు. బాబు నిర్ణయాన్ని రాష్ట్రమంతా ఖండిస్తున్నా పవన్‌కళ్యాణ్‌ మాత్రం మౌనం దాల్చడం సరైన విధానం కాదన్నారు. శాసనసభ నిరవధికంగా వాయిదా పడినప్పుడు స్పీకర్‌ సభలో పార్టీల బలాబలాలను ప్రకటిస్తారని, అయితే టిడిపిలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను కూడా కలిపి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలం 66గా ప్రకటించడం టిడిపి దిగజారుడు వైఖరికి నిదర్శనమని, ఈ వ్యవహారాలపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని దుర్గేష్‌ చెప్పారు.

https://www.google.co.in/search?q=sarikotha+samacharam&oq=sa&aqs=chrome.3.69i60l3j69i59j69i60j69i59.2331j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=kandula+durgesh&*

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=raghaveeyam&*

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.