బలరామ జయంతి వేడుకలు …. Balaram Jayanti celebrations

ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో
బలరామ జయంతి వేడుకలు

balarama.2balarama
రాజమహేంద్రవరం ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య మిషన్ మరియు ఆశ్రమంలోని శ్రీ గౌరాంగ రాధాకృష్ణ మందిరంలో ఆగస్టు 14 నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ త్రిదండి భక్తి కమల గోవింద మహారాజ్ ఆశీస్సులతొ శ్రీ త్రిదండి స్వామి భక్తి కంకణ వన మహారాజ్ ఆధ్వర్యాన గురువారం బలరామ జయంతి సందర్భంగా ఉదయం గోపూజ నిర్వహించారు. సాయంత్రం హారతి ఇచ్చారు. ఆశ్రమ ఇంచార్జ్ శ్రీపాద హరిదాస్ బ్రహ్మచారి పర్యవేక్షించారు. పలువురు భక్తులు పాల్గొన్నారు.
ఇక 25వ తేదీ వరకూ ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు శ్రీ రాధా కృష్ణుల ఊయల ఉత్సవం ఉంటుంది. కాగా 25వ తేదీ గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విశేష కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం 9గంటల నుంచి భగవద్గీత పోటీ, శ్రీకృష్ణ చిత్ర లేఖన పోటీ, బహుమతి ప్రదానం సాయంత్రం ఉట్టికొట్టు ఉత్సవం , బాలల శ్రీకృష్ణ వేషధారణ పోటీలు జరుగుతాయి. రాత్రి 11.45గంటలకు శ్రీ బాల గోపాలునికి 108కలశాలతో భక్తులచే సామూహికంగా అభిషేకం జరుగుతాయి. అర్ధరాత్రి 12గంటలకు 56వెండి పాత్రలతో 56రకాల పిండివంటలతో మహారాజ భోగ నివేదన అనంతరం 108దీపాలతో శ్రీకృష్ణ – గోదావరి మాతకు మహాహారతి అనంతరం తీర్ధ ప్రసాద వితరణ జరుగుతాయి. 26వ తేదీన శ్రీ నందోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆశ్రమ ఇంచార్జ్ శ్రీపాద హరిదాస్ బ్రహ్మచారి కోరారు.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=Balaram+Jayanti+celebrations

http://www.srikrishnachaitanya.org/Activities/

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.