బి.సి.రాయ్‌ జాతీయ అవార్డుకి డా. కర్రి రామారెడ్డి ఎంపిక

2017జూలై 1న రాష్ట్రపతి భవన్ లో అందజేత

ramareddy
ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, సరస్వతీ పుత్రులు, మానస హాస్పటల్‌ అధినేత, నిత్య విద్యార్థి డా. కర్రి రామారెడ్డి ఖాతాలో మరో అవార్డు చేరింది. వైద్య రంగంలో జాతీయ స్థాయిలో ఆస్కార్‌ లాంటి అత్యున్నత డా. బి.సి.రాయ్‌ జాతీయ అవార్డు (2014)కు డా.రామారెడ్డిని ఎంపిక చేసినట్లు ఢిల్లీలోని ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఐ ఎం ఏ ) నుంచి వర్తమానం అందింది. దేశ వ్యాప్తంగా వైద్య రంగంలో విశిష్ఠ సేవలు చేసిన వ్యక్తులను సంవత్సరానికి ఐదారుగురిని ఈ జాతీయ అవార్డుకు ఎంపిక చేస్తారు. 2014, 2015,2016 సంవత్సరాలకు ఎంపిక చేసిన డాక్టర్లకు ఈ అవార్డును బి. సి. రాయ్‌ జయంతి (డాక్టర్స్‌ డే) రోజైన 2017 జులై 1న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేస్తారు. ఈ సందర్బంగా పలువురు డాక్టర్ రామారెడ్డికి అభిననందనలు తెలిపారు .

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.