మన రాజధాని అమరావతి కోసం 2కె రన్

పుష్కర ఘాట్ నుంచి ఆర్ట్స్ కాలేజి వరకు ర్యాలి

 ryaali3ryaali4ryaali2ryaali5ryaali10ryaali14ryaali11ryaali13
మన రాజధాని – మన అమరావతి పేరిట అమరావతి శంకుస్థాపన కు సంఘీభావం తెల్పుతూ , రాజమండ్రిలో సోమవారం ఉదయం 2కె రన్ నిర్వహించారు. ఉదయం 7గంటలకు రాజమండ్రి పుష్కర ఘాట్ నుంచి ఆర్ట్స్ కాలేజి వరకు సాగిన 2కె రన్ ని జిల్లా కలెక్టర్ శ్రీ హెచ్ అరుణ కుమార్ , మేయర్ శ్రీమతి పంతం రజనీ శేషసాయి , రాజమండ్రి సిటీ ఎం ఎల్ ఎ డాక్టర్ ఆకుల సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. సబ్ కలెక్టర్ శ్రీ వి విజయరామరాజు, కమీషనర్ శ్రీ సకలా రెడ్డి , డిపి ఆర్ ఓ శ్రీ ఎం ఫ్రాన్సిస్ , అడిషనల్ ఎస్పీ శ్రీ సిద్దారెడ్డి , ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమీషనర్ శ్రీ డి రమేష్ బాబు , డి వై ఇఒ శ్రీ ఎస్ అబ్రహం , తహసిల్ దార్లు సర్వశ్రీ వివి గోపాలకృష్ణ , దేవి, రామోజీ , పోసయ్య, రమేష్ బాబు , కార్పొరేటర్లు శ్రీమతి ద్వారా పార్వతి సుందరి , డాక్టర్ కొమ్మా శ్రీనివాస్ , కురగంటి ఈశ్వరి , కంటిపూడి పద్మావతి , ఆర్యాపురం బాంక్ మాజీ చైర్మన్ శ్రీ తొక్కుల రామాంజనేయులు ,  ఎస్వీ మార్కెట్ అధ్యక్షులు శ్రీ నందెపు శ్రీనివాస్ ,    ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకులు శ్రీ విష్ణుమూర్తి,అర్బన్ డి.ఐ.తులసీదాస్,కోరుకొండ ఎం ఇఒ .శ్రీ స్వామి,ఫణికుమార్ ,జయంతి శాస్త్రి, ఎపిటిఎఫ్  నగర శాఖ ,అధ్యక్షులు. వఝల .అప్పయ్య శాస్త్రి,డిఎం హెచ్ స్కూల్  హెచ్ ఎం .గోపాల రావు, , పివివి  ప్రసాద్,ఆనంద నగర్ హెచ్ ఎం .వైవి  రామారావు,  తదితరులతో పాటూ ఆదిత్య , శ్రీ గౌతమీ , తిరుమల తదితర విద్యాసంస్థల విద్యార్ధులు , ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు ,ఉపాధ్యాయులు ,సిబ్బంది , వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు , మహిళా సంఘాల ప్రతినిధులు , ఇంకా పలువురు అధికార అనధికారులు పాల్గొన్నారు. గరగలు , డప్పులతో కోలాహలంగా రన్ సాగింది. కార్పొరేటర్ డాక్టర్ కొమ్మా శ్రీనివాస్ కుమార్తె సాహితి కళ్ళకు గంతలు కట్టుకుని మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తూ ర్యాలి లో పాల్గొంది. ‘మన రాజాధాని – అమరావతి’ పేరుతొ ఉన్న 2000టోపీలను ర్యాలిలో పంపిణీ చేసారు.
ఈనెల 22న విజయ దశమి నాడు అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరుగనున్న నేపధ్యంలో ప్రతి ఊరు నుంచి మట్టి – నీరు సేకరించాలన్న ప్రభుత్వ సూచన మేరకు తూర్పు గోదావరి తో పాటు , ఉత్తరాంధ్ర జిల్లాలనుంచి సేకరించిన నీరు – మట్టి రాజమండ్రి నుంచి సోమవారం బయలు దేరడానికి ఏర్పాట్లు చేసారు. దీంతో పక్క జిల్లాలు , అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి నీరు – మట్టి కలశాల తో కూడిన వాహనాలు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజి మైదానికి ముందుగానే చేరాయి. రాజమండ్రిలో సేకరించిన నీరు – మట్టి తో కూడిన వాహనాన్ని కూడా సిద్ధం చేసారు. ర్యాలి అనంతరం సభ నిర్వహించారు. కొప్పోజు హేమ సత్యవాణి ., కాల్నాద భట్ల ఆశ్రిత తన్మయి నాట్య ప్రదర్శన తో సభ ప్రారంభమైంది. అందరిచేత ఎం ఎల్ ఎ డాక్టర్ ఆకుల ప్రతిజ్ఞ చేయించారు. కళ్ళకు గంతలు కట్టుకుని మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తూ ర్యాలి లో పాల్గొన్న కొమ్మా సాహితిని మేయర్ , ఎం ఎల్ ఎ , కలెక్టర్ అభినందించారు. మట్టి వాహనాల దగ్గర వివిధ మత పెద్దల ప్రార్ధనల అనంతరం అమరావతికి వెళ్ళే వాహనాలను మేయర్ , ఎం ఎల్ ఎ , కలెక్టర్ జెండా ఊపి సాగనంపారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.