మరా శాస్త్రి ‘కథారామం’ ఆవిష్కరణ

బహు భాష కోవిదులు శ్రీ మహీధర రామ(మరా)శాస్త్రి రచించి అచ్చయిన కథల సంపుటి ‘కథా రామం’ పుస్తకా విష్కరణ మహోత్సవం ఆదివారం సాయంత్రం రాజమండ్రి గౌతమీ ప్రాంతీయ గ్రంధాలయంలో నిర్వహించారు. ప్రజాపత్రిక కుటుంబం ఆత్మీయంగా నిర్వహించిన ఈకార్యక్రమానికి డాక్టర్ మేజర్ చల్లా సత్యవాణి అద్యక్షత వహించారు. ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కర్రి రామారెడ్డి ఈ పుస్తకాన్ని ఆవిష్కరి స్తూ , శ్రీ మరా శాస్త్రి కథా రచన పటిమను కొనియాడారు. సర్వశ్రీ సన్నిధానం శర్మ , ధూళిపాళ అన్నపూర్ణ , డాక్టర్ హెచ్ ఎస్ ఎం కామేశ్వరరావు , డాక్టర్ గూటం స్వామి పుస్తక సమీక్ష చేస్తూ శ్రీ మరా శాస్త్రి కథా వస్తువుని , శైలిని కొనియాడారు. డాక్టర్ సత్యవాణి మాట్లాడుతూ నిత్య జీవితంలో ఇంకా ఎన్నో ఘటనలు వున్నాయని, ముఖ్యంగా పుష్కరాలలో స్థానికంగా వున్నవాళ్ళు పడిన బాధలు వంటి వాటిని కూడా కథా రూపంలో తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. శ్రీమతి మహీధర కామేశ్వరి అభిప్రాయం చెబుతూ, తనకు రాయడం రాకపోయినా చదవడం బాగా అలవాటు వుందని, తన భర్త శ్రీ రామ శాస్త్రి ఏదో ఒకటి రాస్తూనే ఉంటారని, పేర్కొన్నారు. శ్రీ మరా శాస్త్రి దంపతులను ప్రజాపత్రిక సుదర్శన , దేవీ సుదర్శన్ దంపతులు , అలాగే పలువురు ఘనంగా సన్మానించారు. శ్రీ మరా శాస్త్రి బదులిస్తూ, తనకలం అలా రాస్తూ పోయిందే తప్ప ఇందులో తన గొప్పదనం ఏమీ లేదన్నారు. రచయితల పుస్తకాలను అచ్చు వేయడానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఇతర రాష్ట్రాలలో మాదిరిగా సొసైటీ ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాపత్రిక సుదర్శన్ వందన సమర్పణ చేస్తూ , రాజమండ్రిలో చాలామంది రచయితలూ , కవులు వున్నారని వీరంతా రాసిన పుస్తకాలను పరిచయం చేసుకునే వేదిక అవసరమని పేర్కొన్నారు. ఇందుకు తాము తమ పత్రిక తరపున సహకరిస్తామని చెప్పారు. త్వరలో ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. సర్వశ్రీ డాక్టర్ భామి రెడ్డి , ఫణి నాగేశ్వరరావు , జోరా శర్మ , ఎస్సార్ పృద్వీ  , కర్రా కార్తికేయ శర్మ , సూర్య వంశీ , జి వి భాస్కరరావు, మల్లెమొగ్గల గోపాలరావు, పెమ్మరాజు గోపాలకృష్ణ , పసల భీమన్న , చిరువోలు విజయ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.