మారిశెట్టికి మద్దూరి అన్నపూర్ణయ్య పురస్కార సత్కారం –

    madduri.jpg2madduri

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎందరో యోధులు తమ ధన మాన ప్రాణాలను ఫణంగా పెట్టారు. అందులో తెలుగువారు ఎందరో వున్నారు. అందులో అగ్రగణ్యులు శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య. దాదాపు 14ఏళ్ళు జైలు శిక్ష గడిపారు. జర్నలిస్టుగా ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ఆస్తిని ఉద్యమం కోసం అర్పించారు. అన్నపూర్ణయ్య పేరిట చిన్న పత్రికల్లో పనిచేసే జర్నలిస్తులకోసం రాష్ట్ర ప్రభుత్వం అవార్డు కూడా ప్రవేశ పెట్టింది. ఈ అవార్డు  తొలుదొల్తగా  రాజమహేంద్రవరానికి చెందిన  దివంగత గంధం నాగ  సుబ్రహ్మణ్యంకు దక్కింది.  సుభాష్ చంద్ర బోస్ తో కల్సి పనిచేసి, ఆంధ్ర నేతాజీ గా నిలిచారు. అటువంటి మహనీయుడిని స్మరిస్తూ రాజమహేంద్రవరం కందకం రోడ్ – జెండా పంజా రోడ్ కి ఆనుకుని ఉన్న ప్రాంతంలో మద్దూరి అన్నపూర్ణయ్య పార్కు ఏర్పాటుచేసి అందులో విగ్రహం పెట్టారు. ఇక అన్నపూర్ణయ్య పేరిట సమితి ఏర్పడి గత పాతికేళ్లుగా జయంతి కార్యక్రమం నిర్వహిస్తూ, ప్రముఖులకు పురస్కారాలతో సత్కారం చేస్తున్నారు. అదేరీతిలో ఈ ఏడాది మార్చి 20న అన్నపూర్ణయ్య జయంతి వేడుకలను అన్నపూర్ణయ్య పార్కులో అన్నపూర్ణయ్య సేవా సమితి ఆధ్వర్యాన ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా మాజీ ఎం ఎల్ ఏ శ్రీ రౌతు సూర్య ప్రకాశరావు హాజరయ్యారు. ముందుగా శ్రీ అన్నపూర్ణయ్య విగ్రహానికి శ్రీ రౌతు, కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ శ్రీ రామినీడి మురళీ మోహన్, ఎస్వీ మార్కెట్ అధ్యక్షులు శ్రీ నందెపు శ్రీనివాస్,చాంబర్ అధ్యక్షులు శ్రీ బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, సమితి అధ్యక్షులు శ్రీ కొణతం సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి శ్రీ బెజవాడ రంగారావు,శ్రీ కూరెళ్ల హనుమంతరావు, అనుపోజు వెంకటరమణ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నపూర్ణయ్య సేవలను కొనియాడారు. ఈ సందర్బంగా చాంబర్ మాజీ అధ్యక్షులు,ఎస్వీ మార్కెట్ మాజీ అధ్యక్షులు శ్రీ మారిశెట్టి వెంకట రామారావుకి శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య స్మారక అవార్డు ప్రదానం చేసి సత్కరించారు. . అలాగే సర్వశ్రీ తోలేటి ధనరాజు ,ఆండ్ర నమః శివాయ,తవ్వల మోహనరావు,కోలా వెంకటేశ్వరరావు,తొక్కుల రామాంజనేయులు,పడాల చిన్నబ్బాయి , దేవనశెట్టి నాగేశ్వరరావు,షేక్ జహంగీర్ మస్తాన్,లకు స్మారక పురస్కారాలతో సత్కారం చేసారు. యర్రా కేదారేశ్వర రావు,కోడూరి సుబ్రహ్మణ్యం కూనపరెడ్డి శ్రీనివాస్,పిల్లాడి రామకృష్ణ,కె సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=madduri+annapurnayya&*

 

https://www.google.co.in/search?q=sarikotha+samacharam&oq=s&aqs=chrome.3.69i60l3j69i59j69i60j69i57.1499j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=raghaveeyam&*

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv+raghavarao&*

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.