ముగిసిన రేమెళ్ళ వేదశాస్త్ర పరిషత్ ప్రసంగాలు

 బ్రహ్మశ్రీ రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి వేదశాస్త్ర చారిటబుల్ పరిషత్ 23వ వార్షిక సభ సనదర్భంగా ఆగస్టు 28నుంచి రాజమండ్రి శ్రీరామ నగర్ విరించి వానప్రస్త ఆశ్రమంలో నిర్వహించిన వేదోర్ధ ఉపన్యాసాలు 31రాత్రితో ముగిసాయి. ప్రతిరోజూ సాయంత్రం 6గంటలనుంచి 8గంటలవరకు నిర్వహించిన ఉపన్యాసాలలో భాగంగా తొలిరోజు సాయంత్రం ‘వేదము – ఐ హిక ప్రయోజనము ‘ అనే అంశంపై వేద భాష్య విశారద బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మ ప్రసంగం చేసారు. రెండవ రోజు ‘వేదము – మనవ జీవన విధానం ‘ అనే అంశంపై అలాగే 30వ తేదీ సాయంత్రం ‘వేదము – భక్తి’అనే అంశంపై సాంగ స్వాధ్యాయ భాస్కర బ్రహ్మశ్రీ ప్రవా రామకృష్ణ సోమయాజి ప్రసంగించారు. చివరిర్రోజు 31వ తేదీ సాయంత్రం ‘వేదము – పారమార్ధికత ‘ అనే అంశంపై బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మ ఉపన్యాసం ఇచ్చారు. భాగవత విరించి డాక్టర్ టివి నారాయణ రావు అధ్యక్షత వహించారు. ఆశ్రమ వాసి , రిటైర్డ్ లెక్చరర్ శ్రీ ఖండవల్లి అప్పల శ్రీరామ మూర్తి కూడా ప్రసంగం చేసారు. పరిషత్ కార్యదర్శి శ్రీ విశ్వనాధ గోపాలకృష్ణ వందన సమర్పణ చేసారు. కోశాధికారి డాక్టర్ రేమెళ్ళ రామ సోమయాజులు ఈ కార్యక్రమాలను తదితరులు పర్యవేక్షించారు. సర్వశ్రీ కొంపెల్ల సూర్యనారాయణ , డాక్టర్ డిఎస్ వి సుబ్రహ్మణ్యం , సూరావఝల బాలగంగాధర శర్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.