ముద్రగడ చిత్తశుద్ధి ఏపాటిదో తేలిపోయింది

 కేవలం చంద్రబాబుని వ్యతిరేకించడమే ఎజెండాగా వుంది
ధ్వజమెత్తిన కాపు కార్పొరేషన్ డైరెక్టర్ యర్రా వేణు

kapu
నిన్నటి రోజున కాకినాడలో జస్టిస్‌ మంజునాథన్‌ సారధ్యంలోని బిసి కమిషన్‌ చేపట్టిన కార్యక్రమంలో అనుసరించిన వైఖరి చూస్తుంటే అసలు కాపులను వెనుకబడిన తరగతుల జాబితలో చేర్చాలనే అంశంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి చిత్తశుద్ధి ఏపాటిదో తేలిపోయిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి,కాపు కార్పొరేషన్‌ డైరక్టర్‌ శ్రీ యర్రా వేణుగోపాలరాయుడు వ్యాఖ్యానించారు. కేవలం సీఎం చంద్రబాబుని వ్యతిరేకించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ముద్రగడ, కాపు జె ఏ సి తీరు తెలియజేస్తోందని ఆయన విమర్శించారు. కార్పొరేటర్‌ గాదిరెడ్డి బాబులు, గరగా మురళి, మజ్జి రాంబాబు, నల్లం శ్రీనివాస్‌, చోడిశెట్టి వెంకటేశ్వరరావు, గాలి నరసింహారావు, వీరబాబు, శివప్రసాద్‌ తదితరులతో కల్సి రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ లో గురువారం ఉదయం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాపులను బిసీల్లో చేర్చాలని సహేతుకమైన అంశాలతో నివేదిక సమర్పించి, సానుకూల వాతావరణం ఏర్పరచడానికి సహకరించవలసిన ముద్రగడ సారధ్యంలోని కాపు జెఏసీ అందుకు విరుద్ధంగా వ్యవహరించడం శోచనీయం అమానుషం అని శ్రీ యర్రా అన్నారు. కాపుల్ని బిసీల్లో చేర్చొద్దంటూ బిసి కమిషన్‌ ఎదుట వైౖఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన శాసనమండలి సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ సోదాహరణలతో సుదీర్ఘ ప్రసంగం చేస్తే,ఏమాత్రం అడ్డుచెప్పని, కనీసం ఆయన వ్యాఖ్యల్ని ఖండించని కాపు జెఏసీ, ఆ తర్వాత కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ రామానుజయ్య తన వాదాన్ని వినిపిస్తున్న సమయంలో కాపు జెఏసీ నేతలు అడ్డంపడి ,ఏమాత్రం మాట్లాడనీయకపోవడంలోని అసలు విషయం ఏమిటని శ్రీ యర్రా నిలదీశారు. ఇదంతా చూస్తుంటే, ముద్రగడ వర్గం ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యకు పాల్పడుతూ గుడ్డిగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు అర్ధం అవుతోందని ధ్వజమెత్తారు. నిజానికి కాపుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని వారు దిగజారుడు వైఖరితో వ్యవహరిస్తున్నారన్నారు. ఈ వైఖరి చూస్తుంటే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ముద్రగడ పద్మనాభం మధ్య అక్రమ సంబంధాన్ని చెప్పకనే చెబుతోందని శ్రీ యర్రా వేణు పేర్కొన్నారు. ఇకనైనా కాపు సామాజిక వర్గం ఈ కుతంత్రాలను గ్రహించి వారికి తగిన బుద్ధి చెప్పాలని, చంద్రబాబు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను, సహాయాన్ని వినియోగించుకుని ఆర్థికంగా మెరుగుపడాల ని ఆయన సూచించారు.
ఏప్రిల్‌ 1న కోరంగి కైట్ లో జాబ్‌ మేళా
కాగా కాపు కార్పొరేషన్‌ ఆధ్వర్యాన కాకినాడ దగ్గర కోరంగి కైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు యర్రా వేణు తెలిపారు. ఈ జాబ్‌మేళాలో 50 కంపెనీలు పాల్గొంటాయని, వెబ్‌సైట్‌లో నిరుద్యోగులు తమ పేర్లు నమోదు చేసుకుని పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. కాపు సామాజికవర్గ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి మైక్రో స్మాల్‌ యూనిట్ల ద్వారా 280 గ్రూప్‌లకు శిక్షణ ఇస్తామని చెప్పారు. వారికి రూ 10 లక్షల వరకు సబ్సిడీని కాపు కార్పొరేషన్‌ ద్వారా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కాపు సామాజికవర్గ మహిళలకు బొమ్మూరు, పెద్దాపురం,కాకినాడ తదితర చోట్ల వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు వేణు తెలిపారు. ఉచిత శిక్షణతో పాటు మహిళలకు కుట్టుమిషన్లు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. బహుముఖంగా అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=kapu+corporation&*

https://www.google.co.in/search?q=sarikotha+samacharam&oq=s&aqs=chrome.3.69i60l3j69i59j69i60j69i59.1483j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/search?q=yarra+venugopalarayudu&oq=y&aqs=chrome.5.69i60l4j0j69i59.2563j0j7&sourceid=chrome&ie=UTF-8#q=yerra+venugopal+rayudu&*

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=raghaveeyam&*

 

 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.