ముద్రగడ దీక్ష – భగ్నం – అరెస్టు… Police arrest Mudragada Padmanabham today

 

mudragada2

తుని ఘటన నేపధ్యంలో 7గురు వ్యక్తులను అరెస్టు చేయడంతో వారిని విడుదల చేయాలని , అవసరమైతే తనను అరెస్టు చేయాలనీ డిమాండ్ చేస్తూ, కిర్లంపూడి లోని తన నివాసంలో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం భార్యతో సహా గురువారం ఉదయం దీక్షకు దిగారు. అయితే సాయంత్రం కిర్లంపూడిలో ముద్రగడ ను అరెస్టు చేసి భారీ బందోబస్తు మధ్య పోలీసులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అరెస్టు సమయంలో ఆయన పురుగులమందు తాగినట్లు వదంతులు రావడంతో ముందు జాగ్రత్తగా వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వార్డులో నిపుణులైన వైద్యులతో పరీక్షలు నిర్వహించారు. ముద్రగడను పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ముద్రగడ అన్ని వైద్యపరీక్షలకు సహకరించినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
ఉదయం నుంచి ఉత్కంఠే …

mudragada4mudragada3
ముద్రగడ గురువారం ఉదయం తన నివాసంలోనే దీక్ష చేపట్టినప్పటి నుంచి కిర్లంపూడిలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ముద్రగడను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులను ఆయన అనుచరులు అడ్డుకున్నారు. తలుపులు వేసుకుని దీక్ష చేస్తున్న ముద్రగడ పోలీసులను వెళ్ళిపోవాలని డిమాండ్ చేసారు. సి ఐడి అధికారులు తగిన పత్రాలు చూపిస్తే అరెస్టు అవుతానని ఆయన పేర్కొన్నారు. బలవంతంగా లోపలకు వస్తే ,ఆత్మహత్య చేసుకుంటామని పురుగుల మందు డబ్బా ఆయన దగ్గర పెట్టుకున్నారు. తనను అదుపులోకి తీసుకునేందుకు కారణాలను చూపించాలని ఆయన కోరడంతో సీబీసీఐడీ అధికారులు కొన్ని పత్రాలను తీసుకొచ్చి ముద్రగడ అనుచరులకు చూపించారు. అయినా వారు సంతృప్తి చెందలేదు. కాసేపు నిరీక్షించిన పోలీసులు తర్వాత ముద్రగడ అనుచరులను అరెస్ట్‌ చేసి రాజమండ్రికి తరలించారు. అనంతరం ముద్రగడను అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు రేంజ్‌ డీఐజీ రామకృష్ణ, జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ కిర్లంపూడిలో పరిస్థితి పర్యవేక్షించారు.
ప్రభుత్వాసుపత్రి దగ్గర కర్ఫ్యూ వాతావరణం ..
పద్మనాభంను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆయనను అంబులెన్స్‌లో ప్రత్తిపాడు మీదుగా రాజమండ్రిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ముద్రగడ అరెస్ట్‌తో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కిర్లంపూడిలో భారీ బలగాలు మోహరించారు. కాగా ఆసుపత్రి దగ్గర కర్ఫ్యూ వాతావరణం అలుముకుంది. సర్వశ్రీ ఆకుల వీర్రాజు, నందెపు శ్రీనివాస్ తదితరులు ఆసుపత్రికి చేరుకున్నప్పటికీ లోపలకు వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇక ముద్రగడ కుమారులు బాలు , గిరి మీడియాతో మాట్లాడుతూ తమ ఆవేదన వ్యక్తం చేసారు.
జిల్లా అంతటా సెక్షన్‌ 144, పోలీసు చట్టం 30…
తూర్పు గోదావరి జిల్లాలో సెక్షన్‌ 144, పోలీసు చట్టం 30 అమలులో ఉందని జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్‌ చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… జిల్లాలో ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు, దీక్షలు చేయడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. అలాగే రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలో సెక్షన్‌ 144, పోలీసు చట్టం 30 అమలులో కి తెచ్చారు.
గతంలోకి వెళ్తే …
గత జనవరిలో కాపు గర్జన సభ తునిలో నిర్వహించిన సందర్భంగా రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను ఆందోళన కారులు దగ్దం చేయడమే కాక పోలీస్ స్టేషన్ మీద కూడా దాడి చేసారు. ఈ ఘటన అనంతరం ముద్రగడ తన నివాసంలో ఆమరణ దీక్ష చేపట్టడం , ప్రభుత్వ ప్రతినిధులు వచ్చి , కొన్ని హామీలు ఇచ్చి , దీక్ష విరమింప చేయడం తెల్సిందే. అయితే మొన్నటి రోజున తుని ఘటనకు సంబంధించి 7గురు వ్యక్తులను అరెస్టు చేసిన విషయం తెలుసుకుని , అమలాపురం స్టేషన్ ఎదుట బైఠాయింపు చేయడం, ఆరోజు పోలీసు వ్యాన్ లో ముద్రగడను కిర్లంపూడి తరలించడం, వ్యాన్ లోనే నిరసన కొనసాగించడం, కేసుల ఎత్తివేతకు సంబంధించి డెడ్ లైన్ విధించి, ఈరోజు దీక్షకు దిగారు.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=mudragada%20arrest

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.