సంచలనానికి మారు పేరైన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరో సంచలన ప్రకటనకు తెర లేపాడు. వంగవీటి సినిమా నేపధ్యంలో కొంతమందిని కలుసుకోడానికి విజయవాడ వెళ్లిన వర్మ ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, పవన్ కల్యాణ్‌పై సెటైర్లు విసురుతూ, అసలైన మెగాపవర్ స్టార్ ముద్రగడ పద్మనాభమేనని కితాబిచ్చాడు. అయితే ఈ బిరుదులు పెట్టుకున్న సినిమా స్టార్లు మాత్రం నకిలేనని తేల్చేశాడు. కమ్మ మనస్తత్వం ఉన్న సినిమా ఇండస్ట్రీలోని కాపులతో పోలిస్తే, ముద్రగడే అసలైన మెగాస్టార్ అని వర్మ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. రాజకీయాలను తాను నమ్మనని చెబుతూనే, ముద్రగడ పార్టీ పెడితే అందులో చేరతానని తన పొలిటికల్ ఎంట్రీపై వర్మ క్లారిటీ ఇచ్చేసాడు.
తాను కాపు కులానికి చెందిన వాడిని కానని, తన మిత్రుల్లో అత్యధికులు కమ్మవారేనని వర్మ ఆ ట్వీట్ పేర్కొన్నాడు. అయినప్పటికీ ముద్రగడ పార్టీ పెడితే పార్టీలో చేరతానని వర్మ చెబుతున్నాడు. కాపు రిజర్వేషన్ కోసం దీక్ష చేపట్టిన సమయంలో ముద్రగడ అంశాన్ని ప్రస్తావిస్తూ పవన్ పై సెటైర్లు వేసిన వర్మ ఈ సారి ఏకంగా ముద్రగడ ను ఆకాశానికి ఎత్తేశాడు. మరి దీని భావమేమి?
కాగా వంగవీటి సినిమా గురించి చర్చించడం కోసం శుక్రవారం విజయవాడ వెళ్లిన వర్మ ను కలిసేందుకు రంగా భార్య రత్నకుమారి అంగీకరించలేదట. దీంతో రంగా పూర్వ అనుచరులతో వర్మ నిన్న రాత్రి భేటీ అయ్యాడు. అలాగే దేవినేని నెహ్రూ తో కూడా భేట్టి అయినట్లు తెలుస్తోంది. ఇక తన మిత్రుడైన లగడపాటి, న్యాయవాది కర్నాటి రామ్మోహన్‌రావుతో కూడా వర్మ భేటీ అయి చర్చించనున్నాడు. మొత్తానికి వరుస భేటీలతో వర్మ యమ బిజీగా ఉంటూ మధ్య మధ్యలో ట్వీట్ లతో సంచలనం రేపుతున్నాడు. సినిమా మొదలు కాకుండానే, రూపాయి ఖర్చు లేకుండా పబ్లిసిటీ తారాస్థాయికి చేరడంతో ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు పెరిగాయట. బయ్యర్లు క్యూ కడుతున్నారట. మూడు రోజుల పాటు బెజవాడలో ఉండబోతున్న వర్మ ఇంకెన్ని ట్విస్ట్ లు ఇస్తాడో !!
Related posts
Leave a Reply
Leave a Reply
You must be logged in to post a comment.