మైండ్ గేమ్ మానకపోతే వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్టే

జగన్ పై తెలుగుదేశం నేతల విమర్శలపై రౌతు వ్యాఖ్య

routu
‘గడిచిన ఎన్నికల్లో బిజెపి తో పొత్తు,పవన్ కల్యాణ్ ప్రచారం అన్నీ కలిస్తే తెలుగుదేశం పార్టీ కేవలం ఒకశాతం ఓట్ల ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది. 67సీట్లలో ప్రతిపక్ష స్థానం జగన్ కు వచ్చింది. ప్రజల పక్షాన పోరాడుతూ సమస్యలు ప్రస్తావిస్తున్న జగన్ పై అధికార తెలుగుదేశం మైండ్ గేమ్ ఆడుతూ సమస్యను పక్కదోవ పట్టిస్తోంది. వైస్సార్ సిపి నెగ్గిన వాళ్ళను టిడిపిలో చేర్చుకుని వాళ్ళచేత జగన్ ని తిట్టించడం శోచనీయం ఇదే విధానం కొనసాగిస్తే, 2019 ఎన్నికల్లో తెలుగుదేశానికి ప్రతిపక్ష హోదా కాదు కదా, సింగిల్ డిజిట్ కి పరిమితం కాక తప్పదు. ఎందుకంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’ అని వైస్సార్ సిపి నగర కో ఆర్డినేటర్ శ్రీ రౌతు సూర్యప్రకాశరావు వ్యాఖ్యానించారు. జాంపేటలోని పార్టీ కార్యాలయంలో కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శ్రీమతి మేడపాటి షర్మిల రెడ్డి, సర్వశ్రీ గుత్తుల మురళీధర్, బొంతశ్రీహరి, పోలు విజయలక్ష్మి, వాకచర్ల కృష్ణ,ముప్పన శ్రీను,పోలు కిరణ్ కుమార్ రెడ్డి, దంగేటి వీరబాబు, మజ్జి అప్పారావు తదితరులతో కల్సి గురువారం ఉదయం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సభలో ప్రతిపక్ష నేత ఎప్పుడు లేచి సమస్య ప్రస్తావించినా మైకు ఇవ్వాలని , గతంలో ప్రతిపక్షనేతగా చంద్రబాబు విషయంలో అలానే జరిగిన విషయం రెండు సార్లు శాసన సభ్యునిగా పనిచేసిన తాను గమనించానని అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం శోచనీయమని శ్రీ రౌతు పేర్కొన్నారు. ఎంతసేపు చూసినా, జగన్ సభ జరగనివ్వడం లేదు, అభివృద్ధికి అడ్డపడుతున్నాడు … ఇలా రకరకాలుగా విమర్శించడం ద్వారా మైండ్ గేమ్ కి టిడిపి దిగుతోందని ఆయన పేర్కొన్నారు. 13జిల్లాల కోసం  ఏర్పాటుచేసే రాజధానికి   మూడు పంటలు పండే,33వేల ఎకరాల భూమి అవసరమా అని ఆయన ప్రశ్నించారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఇదంతా కనిపిస్తోందని అన్నారు. ఇక పోలవరం గురించి గొప్పలు చెప్పుకోవడం దారుణమన్నారు. గతంలో 9ఏళ్ళు అధికారంలో వున్నప్పుడు గానీ అంతకుముందు ఎన్టీ ఆర్ హయాంలో చక్రం తిప్పినప్పుడు గానీ పోలవరం ఊసెత్తని చంద్రబాబు హఠాత్తుగా పోలవరం గురించి గొప్పలకు పోతున్నారని శ్రీ రౌతు వ్యాఖ్యానించారు. గతంలో స్వర్గీయ వడ్డి వీరభద్రరావు పోలవరం కోసం ఢిల్లీకి సైకిల్ యాత్ర, అమెరికా యాత్ర చేసినపుడు చంద్రబాబు అసలు స్పందించలేదని ఆయన గుర్తుచేశారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ ని ఎలాగైనా కట్టాలని తలపించి, కీలకమైన కాలువల తవ్వకం పూర్తిచేశారని శ్రీ రౌతు చెప్పారు. ఎంతసేపు మైండ్ గేమ్ ఆడుతూ, గోబెల్స్ ప్రచారం చేసుకోవడం మినహా ఈ ప్రభుత్వం ఏం సాధించిందన్నారు.

https://www.google.co.in/search?q=sarikotha+samacharam&oq=sa&aqs=chrome.4.69i60l4j69i59j69i57.1635j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=routhu+surya+prakash+rao&*

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=raghaveeyam&*

 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.