తనపై దుష్ప్రచారం చేయడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తగదని రాష్ట్ర డిప్యూటీ సీఎం, హోమ్ శాఖామంత్రి శ్రీ నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. రాజమహేంద్రవరం పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం నగరానికి విచ్చేసిన రాజప్ప హోటల్ షల్టన్ లో తనను కలుసుకున్న మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపక్ష వైసిపి అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన తెలుగుదేశం పార్టీ శిక్షణ తరగతుల్లో తనపై టిడిపి యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కోపడినట్లుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. తాను చంద్రబాబు కుటుంబంలో ఒక సభ్యుడిలాంటి వాడినని, ఏనాడు చంద్రబాబు నాయుడే తనను ఏమీ అనలేదన్నారు. లేనివి ఉన్నట్టుగా గోబెల్ ప్రచారం చేయడమే పనిగా వైసిపి పనిచేస్తుందన్నారు. సోషల్ మీడియాలో కూడా ఇష్టానుసారంగా పోస్టింగ్లు పెట్టడం సరికాదన్నారు. ఏదైనా విషయం తెలిసినపుడు అది వాస్తవమో కాదో తెలుసుకుని పోస్టింగ్లు పెట్టాలని సూచించారు. 30ఏళ్ళగా కాపులకు ఏమీ చేయని వారు ఇప్పుడు ఉద్యమాలు అంటూ తయారవుతున్నారని విమర్శించారు. ఉనికికోసమే ముద్రగడ పాదయాత్ర చేపడుతున్నారన్నారు. చిరంజీవి, బొత్స, దాసరి నారాయణరావులు అధికారంలో ఉండగా కాపులకు ఏమి చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు పాదయాత్ర చేసి కాపులు స్థితి గతులను తెలుసుకుని వారిని బిసిల్లో చేర్చాలని నిర్ణయించారని, మంజునాధ కమిషన్ వేశారని, నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటారన్నారు. తమ కృషి కారణంగానే ఇదంతా జరిగిందన్నారు. రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ రాజప్ప లాంటి నీతి, నిజాయితీ గల వ్యక్తిపై బుదరజల్లే ప్రయత్నం సరికాదన్నారు. రాజప్ప కాలి గోటికి కూడా ఈ నాయకులు సరిపోరన్నారు.
https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv%20raghavarao
https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=nimmakayala+chinna+rajappa