యూనివర్శల్‌ హాస్పిటల్స్ లో నవజాత శిశువుల వైద్య విభాగం

yunivarsal4yinivarsalyunivarsal3jpgyunivarsal2నవజాత శిశువుల వైద్యంలో ఇంగ్లాండ్‌లోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆల్డర్‌ హే చిల్డ్రన్స్‌ హాస్పటల్‌, లివర్‌ పూల్‌ ఆసుపత్రిలో శిక్షణ పొందిన ప్రఖ్యాత చర్మవ్యాధుల నిపుణులు డా. ఆరుమిల్లి ప్రసాద్‌చౌదరి పెద్ద కోడలు డా. ఆరుమిల్లి (కోనేరు) ప్రశాంతి ఆధ్వర్యాన రాజమహేంద్రవరం లక్ష్మీవారపుపేటలోని యూనివర్శల్‌ ఆసుపత్రిలో ప్రత్యేక పిల్లల విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగాన్ని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, డా.బిసిరాయ్‌ అవార్డు విజేత డా. కర్రి రామారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డా.రామారెడ్డి మాట్లాడుతూ చర్మ వ్యాధుల చికిత్సలో ప్రసిద్ధి గాంచిన డా.ఆరుమిల్లి ప్రసాద్‌చౌదరి, తన వారసులను యూనివర్శల్‌ ఆసుపత్రి ద్వారా ఎముకల శస్త్రచికిత్స, పిల్లల వైద్యం తదితర విభాగాల్లో సేవలందించేవారిగా తీర్చిదిద్దారని కొనియాడారు. నవజాతుల శిశువులకు వైద్యం చేయడంలో ఇంగ్లాండ్ లో ప్రత్యేక శిక్షణ పొందిన డా. ప్రశాంతి ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించడం అభినందనీయమని అన్నారు.
డా. ప్రసాద్‌ చౌదరి మాట్లాడుతూ డా. రామారెడ్డికి డా. బిసి రాయ్‌ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని, ఆయన మాదిరిగా సమాజంలో మంచిపేరు తెచ్చుకోవాలని తన పిల్లలకు తాను చెబుతుంటానని చెప్పారు. డా. ప్రశాంతి మాట్లాడుతూ యూనివర్శల్‌ హాస్పటల్‌లో శిశువుల ఐసీయూ , ఫోటొ థెరపీ, వెంటిలేటర్స్‌, బబూల్‌ సీపీఏపీ వంటి అధునిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చానన్నారు. శిశువుల్లో ఎదుగుదల లోపం, కామెర్లు, తక్కువ బరువు, పోషక లోపాలు, శ్వాస సమస్యలు, జ్వరాలు తదితర వ్యాధులకు సేవలందిస్తామన్నారు. 0నుంచి 30రోజుల పిల్లలకు ప్రత్యేకంగా ట్రీట్ మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. డా. రాజేంద్రబాబు మాట్లాడుతూ తాము కూడా తన తండ్రి బాటలోనే నడిచి నగర ప్రజలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు సేవలందిస్తామన్నారు. డా. ఆరుమిల్లి కృష్ణ ఫణీంద్ర ప్రసాద్‌, పివిఎస్ కృష్ణారావు, మేడిశెట్టి కృష్ణారావు,తదితరులు పాల్గొన్నారు.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=Dr.+arumilli+prasad+chowdary

https://www.google.co.in/search?q=raghaveeyam&oq=rag&aqs=chrome.4.69i60l3j69i57j69i59j0.2835j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv%20raghavarao

 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.