రాజమండ్రిలో వర్షం

  రాజమండ్రిలో ఈ సాయంత్రం ఓ అరగంట పైగా కురిసిన వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదెమ్మ దిబ్బ , కృష్ణ నగర్ , సుబ్బరాయపురం , తదితర ప్రాంతాల్లో మోకాలు లోటు నీరు చేరడంతో వాహన చోదకులు , ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. కొన్ని ఇళ్ళల్లోకి కూడా నీళ్ళు ప్రవేశించాయి.  ఓ గంటకు మళ్ళీ పరిస్థితులు సర్దుకున్నాయి .  ఇక  రాజమండ్రిలో ఆదివారం కురిసిన వర్షం 12.2మిల్లీ మీతర్లుగా నమోదైంది . అలాగే రాజమండ్రి రూరల్ లో 14.4మిల్లీ మీటర్లు , ఆలమూరు మండలంలో 5.2, సీతానగరంలో 10.4, కోరుకొండలో 12.6, గోకవరంలో 2.8, రాజనగరంలో 21.4మిల్లీ మీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది . 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.