రాజమహేంద్రవరంలో వెల్ టెక్ డా. ఆర్.ఆర్ & డా. ఎస్.ఆర్. యూనివర్సిటీ రీజినల్ ఆఫీస్ ప్రారంభం

 విజన్ -2021 ప్రణాళిక విడుదల 

  vel6vel2velvel5vel3vel4

చెన్నై కు చెందిన వెల్ టెక్ డా. ఆర్ ఆర్ & డా. ఎస్.ఆర్. టెక్నికల్ యూనివర్సిటీ (ఆవడి) రీజినల్ ఆఫీస్ రాజమహేంద్రవరంలో శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ  సందర్బంగా   రాజమండ్రి ఆనందరీజన్సీలో విజన్ -2021 ప్రణాళిక విడుదల కార్యక్రమం  ఏర్పాటుచేశారు  ఎపిటిటిఎ అధ్యక్షులు శ్రీ వి.భాస్కరరామ్ మాస్టర్ ఆఫ్ సెర్మనీగా వ్యవహరించి , సభను నడిపించారు. నగర ప్రముఖులు, సీనియర్ బిల్డర్ , క్లాస్ వన్ కాంట్రాక్టర్ శ్రీ దాట్ల బుచ్చి వెంకటపతిరాజు ,రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మల్యే శ్రీ గోరంట్ల బుచ్చియ్యచౌదరి ఎమ్మల్సీ శ్రీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం సీనియర్ నాయకులు శ్రీ గన్నికృష్ణ స్వామి, ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఛైర్మన్ శ్రీ చల్లా శంకరరావు, డిప్యూటీ మేయర్ శ్రీ వాసిరెడ్డి రాంబాబు, సిసిసి ఎండి, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ పంతం కొండలరావు, వెల్ టెక్ ఫౌండర్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆర్.రంగరాజన్, ఛాన్సలర్ శకుంతల రంగరాజన్ , వైఎస్ ప్రెసిడెంట్ శ్రీ కిషోర్ కుమార్, సిఎండి శ్రీమతి మహాలక్ష్మి , వైస్ ఛాన్సలర్ బీరా సత్యనారాయణ, ప్రో వైస్ ఛాన్సలర్ యు. చంద్రశేఖర్ అతిథులుగా హాజరయ్యారు. శ్రీ వి.భాస్కరరామ్ స్వాగతం పలుకూ అతిధులను ఆహ్వానించారు. శ్రీ గన్నికృష్ణ , ఎమ్మల్యే గోరంట్ల జ్యోతి ప్రజల్వన చేసి సభను ప్రారంభించారు. డిప్యూటీ సిఎం ,హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరుకావలసివుండగా, నడుంనొప్పితో బాధపడుతున్నందున హాజరుకాలేకపోవడంతో అప్పటికప్పుడు పిలిచిన వెంటనే శ్రీ బుచ్చి వెంకట పతిరాజు ముఖ్య అతిధిగా వచ్చారు.
విసి శ్రీ బీరా సత్యనారాయణ స్వాగతోపన్యాసం చేస్తూ, భారతదేశంలో ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన వెల్ టెక్ యూనివర్సిటీ 1997లో ఇంజనీరింగ్ కాలేజిగా ప్రారంభమై,2009నుంచి డీమ్డ్ యూనివర్సిటీగా రూపాంతరం చెందిందని చెప్పారు. ఆంధ్రా యూనివర్సిటీ విసిగా పనిచేసిన తాను నన్నయ యూనివర్సిటీకి ఇంచార్జ్ విసిగా 18నెలలు పనిచేశానని ఆయన గుర్తుచేస్తూ, వెల్ టెక్ యూనివర్సిటీ నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్ (కె ఆర్ సి)గా రాణిస్తోంది చెప్పారు. విదేశాలకు చదువు నిమిత్తం వేళ్ళ ప్రతిభగల పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు కూడా అందిస్తున్నామన్నారు. ప్రో. విసి శ్రీ యు చంద్రశేఖరరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు ని స్ఫూర్తిగా తీసుకుని ఒక విజన్ తో ముందుకు వెళుతున్నామన్నారు. అందుకే ప్రతి ఐదేళ్లకు ఓసారి ప్రణాళిక రూపొందించుకుని లక్ష సాధన దిశగా పనిచేస్తున్నట్టు ఆయన వివరించారు. పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకుని 200% ఉపాధి లక్ష్యంగా తమ యూనివర్సిటీ పనిచేస్తోందన్నారు. కెనడాలో సహా నాలుగు ప్రముఖ యూనివర్సిటీలతో కల్సి పరిశోధనలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈసందర్బంగా వెల్ టెక్ యూనివర్సిటీ గురించి 6నిమిషాల నిడివి గల మల్టీమీడియా ప్రదర్శన ఇచ్చారు. యూనివర్సిటీ 2021 ప్రణాళికను శ్రీ బుచ్చి వెంకట పతిరాజుఆవిష్కరించారు. వెల్ టెక్ యూనివర్సిటీ కొత్త లోగో ను ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చియ్యచౌదరి ఆవిష్కరించారు. శ్యామల సెంటర్ లో ఏర్పాటు చేసిన వెల్ టెక్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆన్ లైన్ లో రిమోట్ ద్వారా ఎమ్మల్సీ శ్రీ ఆదిరెడ్డి అప్పారావు ప్రారంభించారు. బ్రాండ్ బుక్ ను శ్రీ గన్నికృష్ణ ఆవిష్కరించారు. వెల్ టెక్ మహాత్మా గాంధీ నేషనల్  స్కాలర్షిప్ స్కీము-2017 ను శ్రీ చల్లా శంకరరావు ప్రారంభిస్తూ, 1998లోనే వెల్ టెక్ యూనివర్సిటీ గురించి తనకు తెలుసనీ చెప్పారు. సీఎం శ్రీ చంద్రబాబుని ఆదర్శంగా తీసుకుని, పక్కా ప్రణాళికతో వెల్ టెక్ పనిచేయడం అభినందనీయమన్నారు. మెరిట్ గల పేద విద్యార్థులకు తాను కూడా స్కాలర్ షిప్స్ ఇచ్చి చదివిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఇక ముందు కూడా సకరిస్తానని చెప్పారు.
శ్రీ గన్ని కృష్ణ స్వామి మాట్లాడుతూ, పరుగు పెట్టండి, లేదా నడవండి అంతేకాని ఉన్నచోటే ఉండిపోవద్దని శ్రీ శ్రీ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. సీఎం శ్రీ చంద్రబాబు ఆలోచనా విధానంలో వెల్ టెక్ యూనివర్సిటీ ప్రణాళికలతో ముందుకు వెళ్లడం ఆనందదాయకమని అన్నారు. భవిష్యత్తులో దేశానికి గర్వకారణంగా రూపుదిద్దుకోవాలని అన్నారు. ఎం ఎల్ సి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ, వెల్ టెక్ నెలకొల్పిన డాక్టర్ రంగరాజన్ ఇంజనీరింగ్ , పిహెచ్ డి పూర్తిచేయగా, డాక్టర్ శకుంతలా రంగరాజన్ మెడిసిన్ చదివారని, ఇద్దరూ బాగా చదువుకోవడం వలన, అందరినీ చదువులో పైకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారని ఇది చాలా అభినందనీయమని అన్నారు. రబ్బర్ ఇండస్త్రీ పెట్టిన డాక్టర్ రంగరాజన్ అక్కడ పనిచేసే పిల్లలకోసం మెట్రిక్ స్కూల్ నెలకొల్పారని, వెయ్యి మంది కి ఆవిధంగా ఉచితంగా విద్య అందించారని చెప్పారు. 500 ఎకరాల్లో వెల్ టెక్ యూనివర్సిటీని నెలకొల్పి , చదువుతో పాటు స్పోర్ట్స్, ఎన్ సిసి వంటి వాటిలో తర్ఫీదు నివ్వడం అభినందనీయమన్నారు.
పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన వెల్ టెక్ సౌజన్యంతో నలుగురు విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అతిధుల చేతులమీదుగా అందించారు. ఫస్ట్ బి ఎస్సీ చదువుతున్న టి కిరణ్మయి, గైట్ లో చదువుతున్న పలివెల విజయ్, చైతన్య కాలేజీలో చదువుతున్న పితాని సాయిరాం, ఫస్ట్ బి ఎస్సీ విద్యార్థిని నాగ శిరీష స్కాలర్ షిప్స్ అందుకున్నారు.
ఎం .ఎల్. ఏ  శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, చెన్నైలో నెలకొల్పిన వెల్ టెక్ యూనివర్సిటీ విద్యారంగంలో అగ్రగామిగా వివిధ రాష్ట్రాలకు విస్తరించడానికి విజన్ డాక్యుమెంట్ తో ముందుకి వెళ్లడం ఆనంద దాయకమని అన్నారు. సరళీ కృత ఆర్ధిక విధానాల నేపథ్యంలో గతంలో సీఎం శ్రీ చంద్రబాబు విజన్ 2020తో ముందుకెళ్లారని చెప్పారు. ఆతర్వాత మరో పదేళ్లు వెనుకబడినప్పటికీ మళ్ళీ ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ తో ముందుకు వెళుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పరిశోధన, అభివృద్ధి అనే అంశాలు విద్యాలయాల్లో ఉండాలని అన్నారు. అందుకే వెల్ టెక్ ముంగుకి వెళుతోందన్నారు. విదేశాల్లో చదువుకోడానికి వీలుగా అన్ని కులాల్లో పేదలకు 10లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోందని ఆయన గుర్తుచేశారు. అందివచ్చిన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధి రంగంలో మనవాళ్ళు రాణించడానికి అవసరమైన స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలన్నారు. అమరావతిలో వెల్ టెక్ యూనిర్సిటీ బ్రాంచి పెట్టాలని కోరారు.
శ్రీ బుచ్చి వెంకటపతిరాజు మాట్లాడుతూ, నిర్మాణ రంగంలో వున్న తాను, దివాన్ చెరువులో అపార్ట్ మెంట్స్ దగ్గర విద్యకు, పార్కుకి వీలుగా స్థలం వదిలిపెట్టామని, అది ఏమైనా ఉపయోగించుకుంటే, ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్పారు. శ్రీ భాస్కర రామ్ స్పందిస్తూ శ్రీ బుచ్చివెంకట పరిరాజు ఉదారతకు ధన్యవాదాలు తెలిపారు. అమరావతిలో సంస్థలు నెలకొల్పడానికి ఎవరైనా వస్తారని అందుచేత వెల్ టెక్ బ్రాంచి రాజమండ్రిలో పెట్టాలని ఆయన కోరారు.
వెల్ టెక్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంటు శ్రీ కిషోర్ కుమార్ వందన సమర్పణ చేస్తూ, రీసెర్చ్ అండ్ దవలప్ మెంట్ (ఆర్ & డి) కి తమ విశ్వవిద్యాలయం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రపంచంలోని వివిధ యూనివర్సిటీల భాగస్వామ్యంతో ఆర్ & డి మీద పూర్తిస్థాయి దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు. చదువు అన్నది ఎంత ముఖ్యమో డాక్టర్ రంజరాజన్ దంపతులతో పరిచయం అయ్యాక తెలిసిందన్నారు.
తమ యూనివర్సిటీ నేతృత్వంలో వందకోట్ల రూపాయల స్కాలర్షిప్ పధకం అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. వెల్ టెక్ స్కాలర్షిప్ పధకం 2017 నుంచి 2021 వరకూ ఇంజనీరింగ్ విద్యార్థులకు అమలు చేస్తామన్నారు. 2017 జనవరి, ఏప్రిల్ నెలల్లో స్కాలర్ షిప్ ల కోసం ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అతిధులను వెల్ టెక్ యూనివర్సిటీ పక్షాన సత్కరించి మెమొంటోలు అందించారు.
  జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి శ్రీ మారిశెట్టి సత్యనారాయణ, సీసీసీ మేనేజర్ శ్రీ వంక రాజేంద్ర, బులుసు సూర్య ప్రకాష్, ఆకుల ప్రకాష్, కంచుమర్తి చంటి , పంతం శ్రీను,పంతం పవన్  ఆర్యాపురం బాంక్ డైరెక్టర్ శ్రీ సూరంపూడి శ్రీహరి, ఇన్నీసు పేట బాంక్ మాజీ చైర్మన్ శ్రీ నెక్కల అప్పారావు, యాంకర్లు సుకుమార్, చోటు, రాజమహేంద్రి మిహిళా కళాశాల ,మాతృశ్రీ జూనియర్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. జన గణ మన తో కార్యక్రమం ముగిసింది.

అమలాపురంలో చిన్నరాజప్పతో భేటీ …

rajappa
కాగా సభ ముగిశాక వెల్టెక్ యూనివర్సిటీ యాజమాన్య బృందం మధ్యాహ్నం నుంచి అమలాపురం వెళ్ళి డిప్యూటీ సిఎం , హోంమంత్రి శ్రీ నిమ్మకాయల చినరాజప్ప ను కలిశారు. ఎపిటిటిఎ అధ్యక్షులు వి.భాస్కరరామ్, సిసిసి ఎండి పంతం కొండలరావు, వెల్ టెక్ ఫౌండర్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆర్.రంగరాజన్, ఛాన్సలర్ శకుంతల రంగరాజన్ , వెల్టెక్ ఛైర్ పర్సన్, మేనేజింగ్ ట్రస్టీ రంగరాజన్ మహాలక్ష్మి కిషోర్ , వైస్ ప్రెసిడెంటు కిషోర్ కుమార్, ఛాన్సలర్ బీలా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వెల్ టెక్ యూనివర్సిటీ కార్యాచరణ ప్రణాళికలను శ్రీ చినరాజప్ప తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈసందర్బంగా శ్రీ చినరాజప్ప ను వెల్టెక్ యాజమాన్యం దుశ్శాలువ కప్పి సత్కరించారు. రాజమండ్రిలో జరిగిన యూనివర్సిటీ ప్రాంతీయ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరుకాలేకపోయానని, యూనివర్సిటీ ని చూసేందుకు చెన్నై వస్తానని శ్రీ చినరాజప్ప చెప్పడంతో, తమ యూనివర్సిటీ నాలుగు ఇంజనీరింగ్ కాలేజీ లతో అనుసంధానమై ఉందని వెల్ టెక్ యాజమాన్యం చెబుతూ, వచ్చే జనవరి లో వెల్టెక్ యూనివర్సిటీ లో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధిగా హాజరుకావాలని ఆహ్వానించారు .

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=vel%20tech%20dr%20rr%20university

https://www.google.co.in/search?q=raghaveeyam&oq=ragh&aqs=chrome.1.69i60j69i59j69i60l2j69i57j69i60.2523j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/search?q=bv+raghavarao&oq=bv&aqs=chrome.0.69i59j69i57j69i59j0l3.2223j0j7&sourceid=chrome&ie=UTF-8

 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.