రాజమహేంద్రవరం అర్బన్ డి.ఐ.గా దిలీప్ కుమార్

didi2

రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ద కాలంగా ఖాళీ గా ఉన్న ఎంఈవో పోస్టులను భర్తీ చేయడంతో రాజమహేంద్రవరం అర్బన్ రేంజ్ డి.ఐ.గా శ్రీ బి . దిలీప్ కుమార్ గురువారం పదవీ భాద్యతలను చేపట్టారు .ఈయన రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పని చేస్తూ పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు . 1989 బ్యాచ్ ఎ పి పి ఎస్ సి ద్వారా స్కూల్ అసిస్టెంట్ గా ఎంపికైన ఈయన రంపచోడవరం లోనే తొలుత పోస్టింగ్ అందుకున్నారు . అదే పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు అయ్యారు . ఆతర్వాత ,అదే మండలానికి ఎంఈవో గా కూడా భాద్యతలను నిర్వర్తించారు . అదిక శాతం ఏజెన్సీ మండలం లోనే పని చేస్తూ ,సమయపాలన లోను ,క్రమశిక్షణ , నిబద్దత గల అధికారి గా మంచి పేరు పొందారు. ప్రాధమిక స్థాయిలో నిరంతర సమగ్ర మూల్యాంకనం ( సి.సి.ఈ) పటిష్ట అమలు తన లక్ష్యంగా శ్రీ దిలీప్ కుమార్ చెప్పారు . శ్రీ పరస జగన్నాధరావు ,వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు శ్రీ దిలీప్ కుమార్ ని కలిసి అభినందనలు తెలిపారు.

https://www.google.co.in/search?q=education&oq=edu&aqs=chrome.1.69i57j0l5.3531j0j7&sourceid=chrome&ie=UTF-8#q=school+education+east+godavari

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=raghaveeyam

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=parasa+jagannadharao

https://www.google.co.in/search?q=bv+raghavarao&oq=bv&aqs=chrome.1.69i57j69i59j0l4.5891j0j7&sourceid=chrome&ie=UTF-8

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.