రాజమండ్రి ఆర్ట్స్ కాలేజి మైదానంలో నాలుగు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ చాంపియన్షిప్ మెన్ అండ్ ఉమెన్-2015 పోటీలను విజయవంతంగా నిర్వహించి, అందరిచేత ప్రశంసలందుకున్న టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీ పరిమి శ్రీనివాసు(వాసు) పట్టుదల, నిరంతర కృషిని గుర్తించిన రాష్ట్రవాలీబాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ జట్టుమేనేజర్గా నియమించింది. ఈమేరకు రాష్ట్రవాలీబాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీ గన్బాబు,శ్రీ ఎ.రమణారావు ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం రాజమండ్రి సిటీవాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షునిగాఉన్న శ్రీ పరిమి వాసు గత నాలుగురోజులుగా నగరంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ చాంపియన్షిప్ మెన్ అండ్ ఉమెన్-2015 పోటీల నిర్వహణలో చూపిన చొరవ , చేసిన కృషిని గుర్తించి, రాష్ట్రస్థాయిలో కీలకబాధ్యతలు అప్పగించాలని రాష్ట్రసంఘం నిర్ణయించి ఈ విషయాన్ని ప్రకటించారు. వచ్చేఏడాది జనవరి2 నుంచి 9వ తేదీవరకు బెంగుళూరులో జరిగే అఖిలభారత అంతరాష్ట్ర వాలీబాల్ చాంపియన్షిప్ మెన్ అండ ్ఉమెన్ పోటీలకు హాజరయ్యే ఆంధ్రప్రదేశ్ జట్లకు శ్రీ పరిమి వాసు చీఫ్ ప్యాటరన్గా వ్యవహరిస్తారు. శ్రీ వాసు సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్లో సభ్యునిగా నియమించేందుకు తవమంతు కృషిచేస్తామని ఈసందర్భంగా శ్రీ గన్బాబు, శ్రీ రమణారావు తెలిపారు. శ్రీ వాసు నియామకం పట్ల పలువురు క్రీడాకారులు , మిత్రులు హర్షం వ్యక్తంచేస్తూ , అభినందనలు తెల్పారు.