ఏపి ఫోటొ జర్నలిస్ట్స్ అసోషియేషన్ కార్యవర్గసభ్యునిగా రాజమహేంద్రవరం నగరానికి చెందిన సాక్షి దినపత్రిక ఫోటొగ్రాఫర్ గరగ ప్రసాద్ నియమితులయ్యారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు కె.ఎన్.హరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ఎన్.సాంబశివరావు, ఉపాధ్యక్షునిగా యు.సుబ్రహ్మణ్యం, జి.తిరుపతిరావు,ఐ. సుబ్రహ్మణ్యం ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా రూబెన్ బెసాలియల్, సంయుక్త కార్యదర్శిగా యు.ఉమామహేశ్వరరావు, డి.సుమన్‌రెడ్డి, కోశాధికారిగా టి.వి.రమణ, కార్యవర్గసభ్యులుగా గరగ ప్రసాద్, తెలగరెడ్డి వీర భగవాన్, పి.మారుతీరావు,సి.సుబ్బారాయుడు, ఎం.ప్రసాద్, ఎస్.రమేష్‌కుమార్, పిఎల్ఎన్ మోహన్. కె.ప్రసాద్‌కుమార్, ఆర్.హరిప్రియం, బి.హుస్సేన్ నియమితులయ్యారు.