లక్ష్య సాధన దిశగా “మన ఊరు – మనబడి”

mana ooru - mana bdi 2mana ooru - mana badi

ప్రతీ సంవత్సరం జూన్ నెలలో పాఠశాలలు తెరిచిన తరువాత ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్దుల నమోదు జరిగేది .. కానీ , ఈ సంవత్సరం నుండీ సెలవులకు ముందుగానే నమోదు కార్యక్రమం పూర్తి చేసి .. జూన్ 13 నుండీ తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది . ఇపుడు మన ఊరు ,మన బడి అనే కార్యక్రమం లో విద్యార్ధుల నమోదు చేస్తున్నారు. .. ఈ కార్యక్రమం లో ప్రజా ప్రతినిధులు ,వార్డు కార్పొరేటర్ లు, తమ వంతు సహాకారాన్ని అందిస్తూ .. లక్ష్యాన్ని సాధిస్తున్నారు .
రాజమహేంద్రవరం 22 వార్డు లో గల సిటీ ఉన్నత పాఠశాల ఆద్వర్యం లో ఉపాధ్యాయులు,విద్యార్ధులు రాలీ నిర్వహించి , పాత పట్టణ ప్రాధమిక పాఠశాలలో 5 వతరగతి ఉత్తీర్ణులైన 20 మంది విద్యార్ధులను 6 వ తరగతి లో చేర్చారు . ఇపుడు అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లొ కూడా ఆంగ్లమాధ్యమం ఉందనీ, రెండు జతల సమరూప దుస్తులను ,ఉచిత పాఠ్య పుస్తకాలను అందచేస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీ పులగుర్త దుర్గాప్రసాద్ తెలిపారు . ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు సర్వశ్రీ వఝల అప్పయ్యశాస్త్రి సూరిబాబు,పద్మారావు,హవీలా ,కళావతి తదితరులు పాల్గొన్నారు

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.