వర్తక బంద్ విజయవంతం

band

ఆడ్వాన్స్ డ్ వే బిల్లులు , కంప్యూటర్ వే బిల్లులు అంటూ చిల్లర వర్తకులను వేధింపులకు గురి చేయడాన్ని అలాగే బంగారంపై 1శాతం ఎక్సైజ్‌ డ్యూటీ పేరిట ఇతర అధికారులను నెత్తిన రుద్దడాన్ని నిరసిస్తూ, వర్తకులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు రాజమహేంద్రవరంలో సంపూర్ణ బంద్ జరిగింది. చిన్న దుకాణాలు సైతం సాయంత్రం వరకూ మూసివేసారు. మార్చి 13వ తేదీ ఆదివారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన రాష్ట్ర వర్తక సదస్సులో 17వ తేదీన రాష్ట్ర వ్యాప్త వర్తక బంద్‌ చేపట్టాలని తీర్మానించింది. అందులో భాగంగా నగరంలోని దుకాణాలను మూసి వేసి ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. మెయిన్‌రోడ్డులోని చాంబర్‌ భవనం నుంచి వర్తకులు ర్యాలీగా బయలు దేరారు. కెవిఆర్‌ స్వామి రోడ్డు వద్ద బంగారం వర్తకులపై ఎక్సైజ్‌ డ్యూటీని తొలగించాలని ఆందోళన చేస్తున్న సువర్ణ వర్తకులకు సంఘీభావం తెలిపారు. అనంతరం మెయిన్‌రోడ్డు, కోటగుమ్మం, లక్ష్మీవారపుపేట మీదుగా సబ్‌ కలెక్టరేట్‌ వద్ద కు చేరుకొని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ వర్తక ఫెడరేషన్‌ గౌరవ అధ్యక్షులు అశోక్‌కుమార్‌ జైన్ , జిల్లా ఫెడరేషన్‌ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్‌, చాంబర్‌ అధ్యక్షులు బూర్లగడ్డ వెంకటసుబ్బారాయుడు , చాంబర్‌ గౌరవ కార్యదర్శి కాలెపు రామచంద్రరావు, కోశాధికారి క్షత్రియ బాలసుబ్రహ్మణ్యసింగ్‌, ఉపాధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, గ్రంధి వె ంకటేశ్వరరావు, ఇతర నాయకులు కొల్లేపల్లి శేషయ్య, వెత్సా బాబ్జీ, బాలనాగు బలేష్‌గుప్తా, మద్దుల మురళీకృష్ణ, వలవల దుర్గాప్రసాద్‌, లక్కోజు వీరభద్రరావు, కడియాల వరబాబు, ఒంటెద్దు సూరిబాబు, దొ ండపాటి జయసింహ, దొండపాటి ప్రవీణ్‌కుమార్‌, కాంతారాం పాటిల్‌, పొట్లూరి రామ్మోహనరావు, బొడ్డు రామారావు, క్రొవ్విడి సాయి, సప్పా రమణ, వేమన సురేష్‌కుమార్‌, మామిడి సురేష్‌, బత్తుల శ్యామలరావు, దేవత సుధాకర్‌, సింధూ ఫ్యాషన్స్‌ చిన్ని తదితరులు పాల్గొన్నారు.
ఇలా అయితే వ్యాపారం చేసినట్టే….
ఈ సందర్భంగా జైన్‌ మాట్లాడుతూ చిల్లర వ్యాపారంపై అవగాహన లేని అధికారుల పెత్తనంతో రెండు లక్షల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు ., రోజుకో జీఓతో వర్తకులను వేధిస్తున్న నేపధ్యంలో వ్యాపారాలు ఎలా చేయాలని జైన్‌ ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో ఆనాటి ప్రధాని ఇచ్చిన హామీలు ఎపిలో సముచిత స్థాయిలో క్రియ రూపం దాల్చలేదని దాని వల్ల రాష్ట్రాభివృద్ధి మందగించడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించక రైతాంగం ఇబ్బందుల దృష్ట్యా ప్రజల కొనుగోలు శక్తి సన్నగిల్లి వర్తక వాణిజ్యాలు మందగించాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది వ్యవహారశైలి చిల్లర వాణిజ్య రంగాన్ని ప్రభావితం చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త విధానాలు ప్రవేశపెడుతూ చిల్లర వాణిజ్యాన్ని అతలాకుతలం చేస్తున్నారని మండిపడ్డారు. బంగారం వ్యాపారస్తులపై కేంద్ర ప్రభుత్వం ఒక శాతం సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకాన్ని విధించడం వలన , వర్తకునికి భారంగా ఉంటుందన్నారు. నగర సుందరీకరణ పేరుతో నగర పాలక సంస్థ అధికారుల నిబంధనలతో చిరు వ్యాపారులు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారన్నారు. చారిత్రక రాజమహేంద్రవరంలో సందులు,గొందులే వాణిజ్య కేంద్రాలుగా ఉన్నాయన్నారు. నగర విస్తరణ, సుందరీకరణ అంశాన్ని నగరం విస్తరిస్తున్న ప్రాంతంలో చేపట్టాలని, అంతేగాని పాత పట్టణాన్ని సుందరీకరించడం వ్యర్ధ మే కాగలదని ఆయన విశ్లేషించారు. ఇప్పటికే అనేక మార్కెట్లు నగరం వెలుపలికి వెళ్ళిపోయాయని, మరి కొన్ని హోల్‌సేల్‌ వ్యాపారాలు బయటకు విస్తరించే అవకాశాలు ఉన్నందున పురాతన పట్టణాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఉందన్నారు.
నిరవధిక బంద్ కి వెనుకాడం ….
నందెపు శ్రీనివాస్‌,బూర్లగడ్డ వెంకటసుబ్బారాయుడు మాట్లాడుతూ వర్తకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకుని అధికారులు నిబంధనల పేరుతో దాడులు ఆపాలని కోరారు. బడా కంపెనీలకు అనుకూలంగా జిఓలు ఇస్తూ చిరు వ్యాపారులను అతలాకుతలం చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వర్తకుల సమస్యలను పరిష్కరించాలని కో రారు.ప్రభుత్వం దిగిరాకపోతే నిరవధిక బంద్‌కైనా సిద్ధమేనని వారు హెచ్చరించారు. వర్తకుల ఆందోళనకు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి.అరుణ్‌ మద్ధతు తెలిపారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.