వేదశాస్త్ర పరిషత్ ప్రసంగాలు ప్రారంభం

వేదశాస్త్ర పరిషత్ 78వ వార్షిక సభ సందర్భంగా రాజమండ్రి కోరుకొండ రోడ్ లోని శ్రీరామ కృష్ణ మఠం సభా మంటపంలో నిర్వహించతలపెట్టిన ఉపన్యాసాలు ఆగస్టు 31సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఉదయం ఇన్నీస్ పేటలోని హోతా వారి భవనంలో వేద విద్యార్ధులకు పరీక్షలు ప్రారంభం కాగా సాయంత్రం ఉపన్యాసాలు మొదలయ్యాయి. బ్రహ్మశ్రీ రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి వేదశాస్త్ర చారిటబుల్ పరిషత్ కోశాధికారి, శ్రీ గౌతమీ విద్యా పీఠం పూర్వ ఆచార్యులు డాక్టర్ రేమెళ్ళ రామ సోమయాజులు అధ్యక్షత వహించారు. వేదశాస్త్ర పరిషత్ కార్యనిర్వాహక సభ్యులు డాక్టర్ ప్రభల సుబ్రహ్మణ్య శర్మ స్వాగతం పలుకుతూ , వేద విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించడం , ఉపాన్యాసాలు ఏర్పాటుచేయడం , పండిత సత్కారం గావించడం ఇలా త్రివిధ కార్యకలాపాలకోసం పరిషత్ ఏర్పడిందని చెప్పారు. ‘రామాయణం – గృహస్థ ధర్మం ‘ అనే అంశంపై శృంగేరి శారదా పీఠం పౌరాణిక విద్వాంసులు బ్రహ్మశ్రీ సోమాసి బాల గంగాధర శర్మ ప్రసంగం చేసారు. ధర్మానికి మూలమైన భారత దేశంలో సమాజం యావత్తూ గృహస్తాశ్రమం మీదే ఆధారపడి ఉందన్నారు. రామాయణం గృహస్తాశ్రమం గురించి అద్వీతీయంగా వివరిస్తుందన్నారు. సర్వశ్రీ కె శ్రీరాములు, కాలనాధభట్ల సత్యనారాయణ మూర్తి , పెమ్మరాజు గోపాలకృష్ణ , శర్మ , శ్రీమతి రమణి తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.