వేద శాస్త్ర పరిషత్ 78వ వార్షిక సభలు

కృష్ణాష్టమి వస్తోందంటే గోదావరి తీరం వేదఘోషతో పులకిస్తుంది . ‘వేదంలా ఘోషించే గోదావరి …. అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి ‘ అంటూ ఆరుద్ర గీతికకు అనుగుణంగా వివిధ ప్రాంతాలనుంచి తరలివచ్చే వేద పండితుల వేద ఘోష తో గోదావరి తీరం మారుమోగుతుంది. ముఖ్యంగా గడిచిన 78ఏళ్లుగా రాజమండ్రి వేదశాస్త్ర పరిషత్ క్రమం తప్పకుండా ప్రతియేటా కృష్ణాష్టమి కి నాలుగైదు రోజుల ముందు వేద విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించి , పట్టాలు అందించడం, వేదపండితులకు సత్కారాలు చేయడం చేస్తూ వస్తోంది . ఇలా ఎంతో మంది వేద విద్యార్ధులు ఇక్కడ పరీక్షల్లో ఉత్తీర్ణులై , పట్టాలు అందుకుని , తిరుపతి తో సహా పలు ఆలయాల్లో వేద పండితులుగా రాణిస్తున్నారు . పరీక్షాదికారులుగా ఎందఱో ఉద్దండ పండితులు ఇక్కడకు వచ్చి , గోదావరి తీరాన్ని పునీతం చేస్తారు. ఈ ఏడాది కూడా వేదశాస్త్ర పరిషత్ తన కార్యక్రమాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. 78వ వార్షిక వేద శాస్త్ర సభలకు ప్రణాళిక సిద్ధమైంది.
శ్రీ హోతా శ్రీరామ చంద్ర మూర్తి (రాంపండు) కార్యదర్శిగా గల వేదశాస్త్ర పరిషత్ కి ప్రస్తుతం డాక్టర్ వేలూరి రామచంద్ర అధ్యక్షులుగా వున్నారు. సర్వశ్రీ శ్రీపాద కుటుంబరావు , డాక్టర్ ప్రభల సుబ్రహ్మణ్య శర్మ , పెండ్యాల భాస్కర రాముడు , కల్లూరి శ్రీరాములు తదితరులు కార్యవర్గ సభ్యులుగా వున్నారు. వేద శాస్త్ర సభల్లో భాగంగా ఆగస్టు 31నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఇన్నీసు పేట హోతా వారి భవనంలో వేద విద్యార్ధులకు పరీక్షలు నిర్వహిస్తారు . సాయంత్రం వేళ 6నుంచి 8గంటలవరకు కోరుకొండ రోడ్ శ్రీ రామకృష్ణ మఠం లో ఉపన్యాసాలు వుంటాయి. 31వ తేదీ సోమవారం సాయంత్రం గౌతమీ విద్యా పీఠం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రేమిళ్ళ రామ సోమయాజులు అధ్యక్షతన సభ వుంటుంది. ‘రామాయణం – గృహస్తధర్మం ‘ అనే అంశంపై శృంగేరి శారదా పీఠం పౌరాణిక విద్వాంసులు బ్రహ్మశ్రీ సోమాసి బాల గంగాధర శర్మ ఉపన్యసిస్తారు. సెప్టెంబర్ 1వ తేదీ మంగళవారం సాయంత్రం వేద శాస్త్ర పరిషత్ పరీక్షాధికారి బ్రహ్మశ్రీ మంగిపూడి వేంకట శాస్త్రి సలక్షణ ఘనపాఠి అధ్యక్షతన జరిగే సభలో ‘సంధ్యావందన వైశిష్ట్యం’ అనే అంశంపై బ్రహ్మశ్రీ వి శ్రీరామ సలక్షణ ఘనపాఠి ( హైదరాబాద్ వేదభవనం ) ఉపన్యసిస్తారు.
సెప్టెంబర్ 2వ తేదీ బుధవారం సాయంత్రం ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ గంటి కళ్యాణ్ శర్మ అధ్యక్షతన జరిగే సభలో సంస్కృతాచార్యులు బ్రహ్మశ్రీ ధూళిపాళ రామకృష్ణ (విజయవాడ ) ప్రసంగిస్తారు. 3వ తేదీ గురువారం సాయంత్రం ప్రముఖ యూరాలజిస్ట్ ‘భాగవత విరించి’ డాక్టర్ టివి నారాయణరావు అధ్యక్షతన జరిగే సభలో  ‘కఠో పనిషత్తు’ అనే అంశంపై  గౌతమీ విద్యా పీఠం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ ప్రభల సుబ్రహ్మణ్య శర్మ ప్రసంగిస్తారు. ఉపన్యసిస్తారు.
కృష్ణాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం 7గంటలకు రాజమండ్రి త్యాగరాజనగర్ (టి నగర్ ) శ్రీ విశ్వేశ్వర స్వామి గుడు దగ్గర నుంచి వేదపండితుల స్వస్తి వాచకములతొ శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయం వరకు ఊరేగింపు జరుగుతుంది. మధ్యాహ్నం 3గంటలకు కోరుకొండ రోడ్ లోని శ్రీ రామకృష్ణ మఠంలో మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రి అధక్షతన వేదశాస్త్ర పండిత సభ జరుగుతుంది. వేదస్వస్తి , పండిత సత్కారాలు వుంటాయి. వేదాభిమానులు ఈకార్యక్రమాల్లొ పాల్గొని జయప్రదం చేయాలని పరిషత్ కార్యదర్శి శ్రీ హోతా శ్రీరామ చంద్రమూర్తి కోరారు

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.