వైఎస్‌ చివరి కోరిక నెరవేర్చడానికి కృషి

7

 వర్ధంతి కార్యక్రమంలో దుర్గేష్ నివాళి
          8రాహుల్‌ గాంధీని ప్రధాని చేయాలన్నదే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్  వైఎస్‌ రాజశేఖరరెడ్డి చివరి కోరికను నెరవేర్చేలా కృషి చేద్దామని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు శ్రీ కందుల దుర్గేష్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. డాక్టర్  వైఎస్‌ రాజశేఖరరెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా కోటగుమ్మం సెంటర్‌లో నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు శ్రీ ఎన్‌.వి.శ్రీనివాస్‌ ఆధ్వర్యాన బుధవారం ఉదయం నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో శ్రీ దుర్గేష్‌ పాల్గొని, వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ శ్రీ చల్లా శంకరరావు,సర్వశ్రీ పొలసానపల్లి హనుమంతరావు, రాయుడు రాజవల్లి, రామినీడి మురళి, దాసి వెంకట్రావ్‌, ఎస్‌.ఎ.కె. హర్షద్‌, అడపా రాజు, చిక్కాల బాబులు, అబ్ధుల్లా షరీఫ్‌, ఎస్‌.కె.జిలానీ, బెజవాడ రంగారావు, పీసపాటి రవీంద్ర, పొలాకి పరమేష్‌, గోలి రవి, కిషోర్‌కుమార్‌ జైన్‌, కొల్లిమళ్ళ రఘ, కిలపర్తి నాగభూషణం, నరాల లక్ష్మీ పార్వతి, సుమతి, పడాల పెద వెంకటేశ్వరరావు, అంగాడ సరళాదేవి, లోడ అప్పారావు, చామకూర శ్రీనివాస్‌, నలబాటి శ్యామ్‌, గుమ్మడి బాబూరావు, లక్కోజు ఓంకార్‌, దుప్పాటి సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ దుర్గేష్‌ మాట్లాడుతూ అభివృద్ధి పథకాలకు రూపకర్త వైఎస్‌యేనని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా, ఎం.పి.గా, మంత్రిగా, పిసిసి అధ్యక్షునిగా, ముఖ్యమంత్రిగా చేసిన ప్రతి క్షణం పేదల కోసమే పరితపించేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఆయన మరణించారని, రాజకీయ పరంగా వైఎస్‌కు నిజమైన వారసులు తామేనని ఆయన వ్యాఖ్యానించారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.