వ్యవసాయ కళాశాలకు భూ బదలాయింపు

రూ.15 కోట్లు మంజూరు చేసిన విశ్వ విద్యాలయం 

vyavasaaya kalaasala
రాజమహేంద్రవరంలోని వ్యవసాయ కళాశాలకు 22 ఎకరాలు కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ కళాశాల 2008 నుంచే ప్రారంభమైనా సొంత భవనం లేక ఎస్‌.కె.వి.టీ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. విద్యార్ధులకు విద్యాపరంగా సరైన సామగ్రి, పరిశోధనలకు అనువైన వాతావరణం లేకపోవడంతో ఇంతకాలం కాలక్షేపం చేస్తూ వచ్చారు. కళాశాలకు నిడిగట్ట వద్ద స్ధలం కేటాయించాలని భావించినా అది విద్యార్ధులకు సౌకర్యవంతంగా ఉండదనే ఆలోచనతో విరమించుకున్నారు. ఈ నేపధ్యంలో కాతేరులో పొగాకు పరిశోధన సంస్ధకు చెందిన 20 ఎకరాల భూమిని వ్యవసాయ కళాశాలకు బదలాయిస్తూ నిన్న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కాతేరు వద్ద ఉన్న సిటిఆర్‌ఐ స్ధలం పరిశీలనలోకి రావడం, అయితే ఈ స్ధలం బదలాయింపు జరగాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి కావలసి ఉండడంతో ప్రజాప్రతినిధులు డా. ఆకుల సత్యనారాయణ, శ్రీ గోరంట్ల బుచ్చయ్యచౌదరిల కృషి ఫలితంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు చొరవతో ఈ స్ధలం బదలాయింపు నకు చర్యలు తీసుకున్నారు. కళాశాలకు సొంత ప్రాంగణం, వసతి సౌకర్యం ఉంటే సమీప భవిష్యత్‌లో పీజి, పిహెచ్‌డి విద్యార్ధులకు సంబంధించిన కోర్సులు ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం వసతి సౌకర్యం లేకపోవడంతో విద్యార్ధులు ప్రైవేట్‌ వసతి గృహాల్లో ఉండాల్సి వస్తోంది.
ఈ కళాశాల ప్రారంభమయ్యాక నాలుగు బ్యాచ్‌లు పూర్తి కాగా ప్రస్తుత బ్యాచ్‌లో 210 మంది విద్యార్ధులు ఉన్నారు. స్ధల సమస్య తీరడంతో సొంత భవనాల నిర్మాణానికి లైన్‌ క్లియరైంది. ఇలా ఉండగా స్థలం సమస్య పరిష్కారమైన రోజునే కళాశాలకు రూ.15 కోట్లు మంజూరు చేస్తూ విశ్వ విద్యాలయం నిర్ణయం తీసుకుంది.
కేంద్రానికి ఎమ్మెల్యే ఆకుల కృతజ్ఞతలు
వ్యవసాయ కళాశాలకు 22 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసు కోవడం పట్ల సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, వ్యవసాయ కళాశాలకు సొంత భవనం లేకపోవడాన్ని తాము కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్ళగా ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ దృష్టికి తీసుకెళ్ళారని . దీనిపై ఆయన స్పందించి ఈ అంశాన్ని కేంద్ర మంత్రివర్గం ముందు ఉంచడంతో సమస్య పరిష్కారమైంద ని ఆయన పేర్కొంటూ, రాజమహేంద్రవరం అభివృద్ధికి, సంక్షేమానికి సంబంధించిన మరి కొన్ని ప్రాజక్ట్‌లు త్వరలో రానున్నాయని ఆయన పేర్కొన్నారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.