శతమానం భవతి రివ్యూ – Shatamanam Bhavati Movie Review

సమకాలీన కుటుంబ పరిస్థితులకు అద్దంపట్టిన సంక్రాంతి సినిమా 
 శతమానం భవతి 
satamanam bhavatisatamanam bhavati.jpg1
      సినిమా : శతమానం భవతి ;నటీనటులు : శ‌ర్వానంద్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ప్ర‌కాష్‌రాజ్‌, జ‌య‌సుధ‌, న‌రేష్‌, ఇంద్ర‌జ త‌దిత‌రులు  ఫొటోగ్రఫీ : స‌మీర్‌రెడ్డి ;సంగీతం:  మిక్కీ జె.మేయ‌ర్‌ ;కూర్పు: మ‌ధు,;నిర్మాత‌లు: దిల్‌ రాజు.. శిరీష్‌;ద‌ర్శ‌క‌త్వం: స‌తీష్ వేగేశ్న‌ ;సంస్థ‌: శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ .  ఈసినిమాలో భారీ తారాగణం ఉండడంతో పాటూ,  అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్ టి ఆర్, ప్రభాస్ తదితరుల సినిమాల సన్నివేశాలు కనిపిస్తాయి. 
  సంక్రాంతి పండగ అనగానే సినిమా సందడి ఉంటుంది. ఒకప్పుడు రైతు నేపథ్యంతో సంక్రాంతి సీన్లతో సినిమాలు వచ్చేవి. రానురాను  బాగా తగ్గిపోయాయి. అయితే అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వస్తున్నాయి కూడా. ఇక ఈ సంక్రాంతికి(జనవరి  విడుదలైన 14) ‘శతమానం భవతి’ మళ్ళీ అలాంటి వాతావరణం తెచ్చింది. ఈ స్పీడు యుగంలో  కుటుంబాల్లో కనిపిస్తున్న కొన్ని వాస్తవ ఘటనలను ప్రతింబింబిస్తూ తీసిన చిత్రమే ‘శతమానం భవతి’. పిల్లలు వృద్ధిలోకి రావాలని,  విదేశాల్లో ఉద్యోగాలు , వ్యాపారాలు చేస్తూ ఉన్నత స్థాయికి చేరాలని తల్లిదండ్రులు కలలు కంటారు.. కానీ ఆఖరికి తల్లిదండ్రులని చూడ్డానికి ఏడాదికి ఒకసారి కూడా రాలేకపోతే, ఆ తల్లిదండ్రులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసి నిరాశ చెందే స్థాయికి వెళ్తే, ఎలా? అదే విషయాన్ని ‘  శతమానం భవతి’ చాటిచెప్పింది. ఇంటిల్లిపాదినీ థియేట‌ర్‌కి తీసుకురావాల‌ని త‌పించే ప్రయత్నానికి ఈ సినిమా నూటికి నూరు మార్కులు తెచ్చుకుంటుందనే చెప్పాలి. పాటల్లో స్టెప్పులు,ఫైట్లు లేకుండా, అసభ్యత కు చోటులేకుండా చిన్నపిల్లలా దగ్గరనుంచి బామ్మలవరకూ అందరూ వీక్షించేలా ఈ చిత్రాన్ని రూపొందించారు.  గ‌తేడాది సంక్రాంతికి పెద్ద హీరోల  చిత్రాల మ‌ధ్య `ఎక్స్‌ప్రెస్ రాజా`తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చి విజ‌యాన్ని సొంతం చేసుకొన్న శ‌ర్వానంద్ మళ్లీ అదే తీరులో ఈ సంక్రాంతి పండ‌క్కి..’శతమానం భవతి’ మూవీతో వచ్చాడు.   కథలోకి వెడితే,…
   గోదావరి జిల్లాలోని ఆహ్లాదకర పల్లె వాతావరణంలో  చిత్రీకరించిన ఈ సినిమా సంక్రాంతి నేపథ్యంతో నడుస్తుంది.   అంద‌మైన ప‌ల్లెటూరు ఆత్రేయ‌పురం. ఆ వూళ్లో రాఘ‌వ రాజు (ప్ర‌కాష్‌రాజ్‌), జాన‌క‌మ్మ (జ‌య‌సుధ‌) దంప‌తుల గురించి తెలియ‌ని వాళ్లంటూ ఎవ్వ‌రూ ఉండ‌రు. ఉన్న ఇద్ద‌ర‌బ్బాయిలు, అమ్మాయి విదేశాల్లో స్థిర‌ప‌డిపోవ‌డంతో, త‌మ్ముడి కొడుకు కంగార్రాజు (న‌రేష్‌), మ‌న‌వ‌డు రాజు (శ‌ర్వానంద్‌)తో క‌లిసి నివ‌సిస్తుంటారు. పండ‌గ‌ల‌కి కూడా వూరివైపు క‌న్నెత్తి చూడ‌ని పిల్ల‌ల్ని గుర్తుకు తెచ్చుకొని మ‌థ‌న‌ప‌డిపోతుంటుంది జాన‌క‌మ్మ‌. ఇంత‌లో సంక్రాంతి పండ‌గొచ్చేస్తుంది. ఎలాగైనా పిల్ల‌ల్ని పండ‌క్కి  పిలవాలని, తప్పనిసరిగా రప్పించాలని , లేకుంటే నేనే వాళ్ళ దగ్గరకు వెళ్లిపోతానని జానకమ్మ ఖరాఖండీగా చెప్పేస్తుంది. దీంతో పిల్లల్ని ఎలాగైనా  ర‌ప్పించాల‌ని రాఘ‌వ‌రాజు   ఓ ప‌థ‌కం ర‌చిస్తాడు. ఫలితంగా   పండ‌క్కి అంద‌రూ ఆ  వూరికొచ్చేస్తారు. ఆస్ట్రేలియా నుంచి వ‌చ్చిన మ‌న‌వ‌రాలు నిత్య (అనుప‌మ‌) వ‌ర‌స‌కు బావైన రాజుతో ప్రేమ‌లో ప‌డుతుంది. ఇంత‌లోనే రాజుగారు పిల్ల‌ల్ని వూరికి ర‌ప్పించ‌డం కోసం వేసిన ప‌థకం గురించి జాన‌క‌మ్మ‌కి తెలిసిపోతుంది. దాంతో ఇంట్లో గొడ‌వ మొదలు. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య కూడా భేదాభిప్రాయాలు సరేసరి.  ఇంత‌కీ రాజుగారు వేసిన ఆ ప‌థ‌కం ఏంటి? ప‌ండ‌క్కోస‌మే పిల్ల‌ల్ని వూరికి రప్పించాల‌నుకొన్నాడా లేక వేరే ఏదైనా కార‌ణ‌ముందా?  కుటుంబ స‌భ్యుల మ‌ధ్య భేదాభిప్రాయాల‌తో రాజు, నిత్య‌ల ప్రేమ‌ ఫలించిందా లేదా అనే విషయాలు తెలియాలంటే వెండితెరపై ఈ సినిమాను వీక్షించాల్సిందే. 
బంధాలకు.. అనుబంధాలకు `శ‌త‌మానం భ‌వ‌తి`
  ఈసినిమా బంధాలకు అనుబంధాలకు పెద్దపీట వేసింది.  తండ్రీ, కొడుకు, అన్న‌, త‌మ్ముడు, మావ‌య్య‌, పిన్ని, అత్త‌, మామ, మ‌ర‌ద‌లు… ఇలా బంధాలే క‌దా అనిపించొచ్చు. కానీ ఆ బంధాలు, అనుబంధాల మ‌ధ్య స‌రైన సంఘ‌ర్ష‌ణని చూపిస్తే మాత్రం భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఇలాంటి చిత్రాలకు సంబంధించి ఇప్పటికే వెండితెరపై   ఎన్నో అద్భుత  కుటుంబ క‌థ‌ల్ని  చూపించిన‌ప్ప‌టికీ… స‌తీష్ వేగేశ్న రాసుకొన్న ఈ క‌థ‌, అనుబంధాల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌ని ఆయ‌న  చూపించిన తీరు కొత్తపుంతలు తొక్కించింది.  పిల్ల‌లు ఇంటిని మ‌రిచిపోతే పెద్ద‌లు ప‌డే ఆవేద‌న, కుటుంబంలోని విలువ‌లు అంటే ఏమిటో, అవెలా ఉంటాయో ఈ చిత్రంలో  ద‌ర్శ‌కుడు చూపించడంలో ఫలవంతమయ్యాడు. కథ, సన్నివేశాలు పాతవే అయినా  ప్ర‌తీ స‌న్నివేశం ఆస‌క్తిక‌రంగా, ఒక  మధురానుభూతి మిగిలుస్తూ సాగిపోతుంది.  ప‌చ్చ‌ని ప‌ల్లెటూరి అందాల మ‌ధ్య… స్వ‌చ్ఛ‌మైన హాస్యంతో, మ‌రికొన్ని చోట్ల గుండె బ‌రువెక్కించే స‌న్నివేశాల‌తో ఈ చిత్రంలో ఫస్టాఫ్ సాగిపోతుంది. ద్వీతీయ భాగంలో  మాత్రం  స‌న్నివేశాల‌న్నీ తేలిపోతూ సాగాయి. అయితే  ప‌తాక స‌న్నివేశాల్లో మ‌ళ్లీ భావోద్వేగాలు  పండాయి. 
   చివరిగా … 
   శ‌ర్వానంద్ ఈ సినిమాలో కొత్త‌గా క‌నిపించాడు.ఇక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ అటు అందంతోనూ, ఇటు న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటుంది. ఆమె సొంతంగానే డ‌బ్బింగ్ చెప్పుకోవడం ద్వారా తెలుగు  బాగా మాట్లాడింది. ప్ర‌కాష్‌రాజ్‌, జ‌య‌సుధ‌, న‌రేష్ పాత్ర‌లు సినిమాకి కీల‌కం. ప్ర‌కాష్‌రాజ్‌, జ‌య‌సుధ‌లు ఎప్ప‌ట్లాగే వాళ్ల వాళ్ల పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. బంగార్రాజు కాస్త కంగార్రాజుగా మారిపోయి న‌రేష్ చేసే సంద‌డి కొన్ని స‌న్నివేశాల్లో న‌వ్వులు పండిస్తుంది. సాంకేతికంగా ఈ సినిమా ఉన్న‌తంగా ఉంటుంది. స‌మీర్‌రెడ్డి కెమెరా ప‌ల్లెటూరి అందాల్ని అద్భుతం అనిపించేలా చూపించింది.  మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం క‌థ‌కి కొత్త అందాన్ని తీసుకొచ్చింది. స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వ శైలి, ఆయ‌న రాసుకొన్న క‌థ చాలా బాగుంది. పండగొస్తే ఆప్యాయంగా మాట్లాడుకోకుండా టీవీలకు అతుక్కుపోవడం,సెల్ ఫోన్లలో అదేపనిగా మాట్లాడ్డం వంటి అంశాలను ఈ చిత్రంలో బానే చూపించారు. అందుకే   క‌థ‌, న‌టీన‌టులు, ఫొటోగ్రఫీ,  సంగీతం ఈ చిత్రానికి బలాన్నిచ్చాయి. అయితే కథ ప్రేక్షకుడి వూహకు అందటం,ద్వితీయార్ధంలో స‌న్నివేశాలు నిదానంగా సాగడం వంటివి మైనస్ పాయింట్లు అనే చెప్పాలి. నటుడు మురళీమోహన్ బ్యాక్ డ్రాప్ వాయిస్ తో సినిమా మొదలై   ‘పండగకు మీ ఊరు వెళ్ళండి .. కుటుంబ సభ్యులు అందరి మధ్యా పండగ జరుపుకోండి’ అంటూ చెప్పిన  బ్యాక్ డ్రాప్ వాయిస్ తో ముగిసింది.   రాజమండ్రిలో శ్యామలా థియటర్ లో ఉదయం 8.15గంటలకు షో పడింది. 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.