శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాలు
23న అంకురార్పణ – 24న మహాశివరాత్రి స్వామివారి కళ్యాణం
రాజమహేంద్రవరం గోదావరి గట్టున గల శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి పాంచాహ్నిక దివ్య కల్యాణ మహోత్సవాలు ఫిబ్రవరి 23నుంచి 27వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 23గురువారం మధ్యాహ్నం 3.50 గంటలకు గణపతి పూజ అంకురార్పణ,. 24వ తేదీ మహాశివరాత్రి సందర్బంగా తెల్లవారుఝామున 1గంటనుంచి సాయంత్రం 5.30గంటల వరకూ పరమేశ్వరునకు అభిషేకాలు, పార్వతి అమ్మవారికి విశేష కుంకుమ పూజలు లక్ష కుంకుమార్చన జరుగుతాయి. తెల్లవారుఝామున 1గంటనుంచి 3గంటలవరకూ దేవస్థానం తరపున సుప్రభాత సేవ, ప్రధమాభిషేకం అర్చన జరుగుతాయి. సాయంత్రం 6గంటల నుంచి ధూప ప్రాకారపు సేవలు అనంతరం ఎదురుకోలు వేదస్వస్తి. రాత్రి 7.48గంటలకు సుముహూర్తం తదితర కార్యక్రమాలు బ్రహ్మశ్రీ వింజమూరి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఆగమాచార్య డాక్టర్ ఎం ఆర్ వి శర్మ శ్రీ శివ పార్వతుల కళ్యాణం గురించి వ్యాఖ్యానం చేస్తారు. స్వామివారి కళ్యాణం తో పాటు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుతుంది. రాజపురోహితులు శ్రీ పెద్దింటి వెంకట సుబ్బారాయుడు పర్యవేక్షణలో జరుగుతాయి. ఈసందర్బంగా 6.30నుంచి 7.30గంటలవరకూ నాట్యాచార్య డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ ఆచార్యత్వంలో శైవాగమ శాస్త్ర రీతిలో నటరాజ కళా నికేతన్ విద్యార్థులచే ఆలయ నృత్యారాధన జరుగుతుంది. రాత్రి 12గంటలకు శ్రీ కూర్మదాసు ప్రభాకర్ శ్రీమతి మంజు దంపతులచే సహస్ర పుష్పార్చన, శ్రీ రామేన శివన్నారాయణ భజన బృందంచే 18రకాల ప్రత్యేక హారతులు జరుగుతాయి. 25న సదస్యం వేద పఠనం,పండిత సత్కారం అంతంతరం శ్రీ పెద్దేహపు సాయిబాబా శ్రీ ఆర్ సుధాకర్ వారి నాదస్వర వాయిద్యాలతో ఊరేగింపు(రధోత్సవం), 26 ఆదివారం ఉదయం హోమాలు , రాత్రి బలిహరణం. 27న సూర్యోదయానికి ముందు నాకబలి, ఉదయం 7.06గంటలకు మార్కండేయ ఘాట్ లో త్రిసూలం స్నానం. రాత్రి 8గంటలకు శ్రీ పుష్పోత్సవం. నీరాజన మంత్ర పుష్పాలు. ఈకార్యక్రమాలను జయప్రదం చేయాలని భక్తజనులకు ఆలయ ఈవో శ్రీ జి సత్య రమేష్ సారధ్యంలో ఆలయ అర్చకులు శ్రీ కెవిఎస్ సర్వేశ్వరరావు తదితరులు అలాగే సీనియర్ అసిస్టెంట్ రాపాక శ్రీనివాసరావు తదితరులు కోరారు.
https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv+raghavarao
https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=Godavari