శ్రీ విఖనస జయంతి మహోత్సవం 

vaikhanasa

రాజమండ్రి క్షేత్ర పాలక శ్రీ వేణు గోపాల స్వామి ఆలయంలో ఆగస్టు 29,  30 తేదీలలో  శ్రీ విఖనస జయంతి మహోత్సవాలు  ఘనంగా నిర్వహించారు. శ్రీ రాజమహేంద్రి వైఖానస సమాఖ్య (అర్బన్ , రూరల్ ) ఆధ్వర్యాన   నిర్వహించిన ఈ వేడుకల్లో బాగంగా స్వామి వారి అర్చన కైంకర్యాలు  శ్రీ పాణంగిపల్లి  రవిబాబు జరిపించారు. 30వ తేదీన వైఖానస పండిత , విశిష్ట , ఆత్మీయ , అభినందన సత్కార సభ రాష్ట్ర అర్చక సమాఖ్య కార్యదర్శి , తూర్పు గోదావరి  జిల్లా శ్రీ  వైఖానస సంఘం అధ్యక్షులు శ్రీ కె వి ఎస్ ఆర్ ఎన్ ఆచార్యులు అధ్యక్షతన జరిగింది.  ఈసందర్భంగా మాజీ ఎం ఎల్ ఎ శ్రీ రౌతు సూర్య ప్రకాశరావు, అనపర్తి ఎం ఎల్ ఎ శ్రీ నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి , తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎర్రా వేణుగోపాల రాయుడు , 22వ వార్డు  కార్పొరేటర్ శ్రీ మాటూరి రంగారావు , అర్బన్ జిల్లా తెలుగుదేశం ప్రచార సమన్వయ కర్త , మాజీ కార్పొరేటర్ శ్రీ కురగంటి సతీష్, లకు అభినందన సత్కారం చేసారు. ప్రముఖ వైద్యులు , తూర్పు గోదావరి  జిల్లా శ్రీ  వైఖానస సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ పెద్దింటి సీతారామ భార్గవ కు విశిష్ట గౌరవ సత్కారం చేసారు.  ఎపి ప్రభుత్వ అవార్డు గ్రహీత , శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ అర్చక స్వామి శ్రీ ఖండవల్లి అనంత పద్మనాభాచార్యులు , దేవాదాయ శాఖ ఆగమ సలహా సంఘ సభ్యులు శ్రీ సుదర్శనం వెంకట జనార్దనా చార్యులు , శత సహస్ర ప్రతిష్టాపనాచార్య శ్రీ శ్రీనివాసుల వెంకట సత్య సూర్య శేషాచార్యులు లకు శ్రీ వైఖానస పండిత సత్కారం నిర్వహించారు. అలాగే శ్రీ పెరవలి శేశాచార్యులకు ఆత్మీయ గౌరవ సత్కారం చేసారు.

అలాగే 2015  గోదావరి పుష్కరాల సందర్భంగా తీర్ధ విధులు నిర్వహించిన వారికి ప్రత్యేక సత్కారం చేసారు. 2014-15విద్యా సంవత్సరంలో 10వ తరగతి , ఇంటర్ , డిగ్రీ , విభాగాలలో ప్రతిభ కనబరిచిన శ్రీ వైఖానస విద్యార్ధులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. కమిటీకి చెందిన సర్వశ్రీ పెద్దింటి నరసింహాచార్యులు , పెరవలి సాయిరామాచార్యులు , చక్రవర్తుల రవికుమార్ , ఖండవల్లి కిరణ్ కుమార్ , ఖండవల్లి విజయ సారధి , పాణంగిపల్లి  వాసు , పెద్దింటి చంటిబాబు , అగ్నిహోత్రం శ్రీనివాస చక్రవర్తి , ప్రేమ కుమార్ , వాడపల్లి రాధాకృష్ణ , సుదర్శనం వెంకట సత్యనారాయణా చార్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.