శ్రీ సద్గురు సన్నిధి వార్షికోత్సవంలో సప్పా శిష్యుల నృత్య ప్రదర్శన

sappa2sappasappa3

శ్రీ సద్గురు సన్నిధి (నెలవారీ సంగీత , నృత్య సభ )తృతీయ వార్షికోత్సవం సందర్భంగా గోదావరి గట్టున గల శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవాసమితి ప్రాంగణంలో మూడు రోజుల పాటు వార్షిక సంబరాలు నిర్వహించింది. చివరి రోజు ఆదివారం రాత్రి నటరాజ నృత్య నికేతన్ వ్యవస్థాపకులు , నాట్యాచార్య శ్రీ సప్పా దుర్గాప్రసాద్ శిష్య బృందంచే శైవాగమ నృత్య పద్దతిలో ‘ఆలయ నృత్య ప్రదర్శన నిర్వహించారు. శ్రీ పురాణం గణపతిరావు వయోలిన్ పై , శ్రీ సప్పా యశోద కృష్ణ మృదంగం పై సహక రించారు. శ్రీ వి దుర్గాప్రసాద్ స్త్రీ గాత్రం అందించారు. డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ తాళదారి గా వాయ్వహరించారు. చి.లు . పి క్షీర సాగరి , ఎం జె ఎస్ దివ్య మాధురి , ఆర్ నళినీ లత , వి ఎస్ ఎల్ దక్షిత , ఎం జె ఎస్ సుమశ్రీజ, ఎం శ్రీ జయ అనూష , జె శ్రీ అంకిత ఐశ్వర్య, జె శ్రీ ఆశ్రిత చంద్రిక , బి చందన సౌమ్యశ్రీ ,పి శ్రీపూజిత , ఎ అన్షి లు ప్రదర్శనలో పాల్గొని అలరించారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.