‘శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర’ .. “Srisubrahmanya Swami History” Book Review

చక్కని సమన్వయహారం ‘శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర’
గ్రంథ సమీక్షలో డాక్టర్ ధూళిపాళకు వక్తల ప్రశంసలు

surbahmanya charitra
‘కుమారస్వామి జననం గురించి వివిధ పురాణాలు, కావ్యాలలో స్వల్ప వైరుద్ధ్యాలు ఉన్నాయి. ప్రవచన రాజహంస డాక్టర్‌ ధూళిపాళ మహాదేవమణి ‘ శ్రీ సుబ్రహ్మణ్య చరిత్ర’ గ్రంథంలో ఈ వైరుద్ధ్యాలకు చక్కని సమన్వయం సాధించారు. అన్ని విధాలా మణి ‘సమన్వయచక్రవర్తి బిరుదానికి అర్హుడు’’ అని రామాయణ రత్నాకర డాక్టర్‌ కేసాప్రగడ సత్యనారాయణ పేర్కొన్నారు. కొన్ని వేదమంత్రాలను స్వరయుక్తంగా చదవడానికి దంతాలు అడ్డువస్తాయని అందుకనే సుబ్రహ్మణ్యస్వామి నాగేంద్రుడిగా అవతరించి వేదమంత్ర స్వరాన్ని కాపాడారని అన్నారు. ఫిబ్రవరి 16 గురువారం రాత్రి శ్యామలానగర్‌ రామాలయం సెంటర్‌లో శ్రీ వక్కలంక శ్రీరామచంద్రమూర్తి(రామం) గృహంలో శ్రీగాయత్రీ సత్సంగం ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రంథ సమీక్షా సమావేశంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు. గ్రంథంలో అనేక ఉపయుక్తమైన మంత్రాలను, శ్లోకాలను రచయిత పొందుపరిచారని, ఇందులో పేర్కొన్న షష్టీస్తోత్రం చదివితే, శిశువులకు బాలారిష్టాలు తొలగిపోతాయని ఆయన అన్నారు.
    భాగవత విరించి డాక్టర్‌ టి.వి.నారాయణరావు సభకు అధ్యక్షత వహిస్తూ, ‘షణ్మత’ (6) స్థాపకుడైన ఆదిశంకరులు‘ పంచాయతన’(5) పూజలను ఎలా ప్రవేశపెట్టారని మనకు ఒక సందేహం రావచ్చు, పూజ సమయంలో వెలిగించే దీపమే సుబ్రహ్మణ్య స్వామి’ అని ఆయన వివరించారు. గణపతి, కుమారస్వాములు పుత్ర తత్త్వాన్ని తెలియజేస్తే, శివపార్వతులు మాతాపితరుల తత్త్వాన్ని లోకానికి తెలియజేస్తున్నారని అన్నారు. కుమారస్వామిని ఆరాధిస్తే, శివపార్వతులను, లక్ష్మీనారాయణులను ఆరాధించిన ఫలితం వస్తుందన్నారు.
    డాక్టర్‌ ధూళిపాళ మహాదేవమణి మాట్లాడుతూ ఈ గ్రంధం రాయడానికి గల సంకల్పాన్ని తెలిపారు. ఆరు సంవత్సరాల కృషి ఫలితమే ఈ గ్రంథమని చెప్పారు. అమెరికాలో ఉండగా ఆన్ లైన్ లో ఎన్నో పురాణ గాధలను పరిశీలించి పరీశిలించి ఈ గ్రంధం రాసినట్లు ఆయన చెబుతూ, ఇంతమంది పండితులు , ప్రముఖుల నడుమ సమీక్ష జరగడం నిజంగా ఆనందంగా ఉందన్నారు. అందరికీ పేరుపేరునా కృతజ్ఞలు తెలిపారు.
   సీనియర్ పాత్రికేయలు, సూర్య సాయంకాలం పత్రిక సంపాదకులు శ్రీ వీఎస్‌ఎస్‌ కృష్ణకుమార్‌ స్వాగత వచనాలు పలికారు. ఆదాయపు పన్ను శాఖాధికారి శ్రీ రామావతారం, శ్రీ ఓరుగంటి గురుప్రసాద శర్మ, రాష్ట్రపతి పురస్కార గ్రహీత చింతలపాటి శర్మ, కళాగౌతమి వ్యవస్థాపకులు డాక్టర్ బివిఎస్ మూర్తి, పాత్రికేయులు శ్రీ వారణాసి సుబ్రహ్మణ్యం, అవధాన అష్టాపద తాతా సందీప్, శతావధాన విశారద ఫుల్లాభట్ల నాగశాంతిస్వరూప, ధర్మంచర కార్యదర్శి శ్రీ జి ఆర్ సీఎస్ శాస్త్రి, శ్రీ దుర్భ శ్రీరామమూర్తి గ్రంథకర్తను అభినందించారు. వక్తలను శాలువా, ఫల పుష్పాదులతో సత్కరించారు. సర్వశ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ, పెమ్మరాజు గోపాలకృష్ణ, కొత్తపల్లి అప్పాజీ,శ్రీపాద జిత్ మోహన్ మిత్రా,జోరాశర్మ, విశ్రాంత బ్యాంక్‌ మేనేజర్‌ చెరుకుపల్లి గాంగేయశాస్త్రి, పలువురు సాహితీవేత్తలు హాజరయ్యారు. శ్రీ వక్కలంక రామం అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఫలహారం అందించారు. కాగా శ్రీ సుబ్రహ్మణ్య చరిత్ర గ్రంధాన్ని ఇక్కడ సగం ధర(రూ 100)కే అందించడంతో పలువురు కొనుగోలు చేసారు.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=dhulipala+mahadeva+mani

https://www.google.co.in/search?q=raghaveeyam&oq=ra&aqs=chrome.2.69i60l2j69i59j69i60l2j69i59.2716j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv+raghavarao

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=sri+subramanya+swamy+temple

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=Dr.+T.V.+Narayana+Rao

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=kesapragada+satyanarayana

 

 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.