సంధ్యావందన వైశిష్ట్యం అంతా ఇంతా కాదు …..

వేదశాస్త్ర ఉపన్యాసాలలో శివరామకృష్ణ శర్మ ప్రసంగం
సంధ్యా వందనం వలన మనిషి జీవితం మహోన్నతంగా మారుతుందని , తద్వారా పరమ చైతన్యం పొందుతారని బ్రహ్మశ్రీ చిర్రావూరి శివరామ కృష్ణ శర్మ అన్నారు. వేదశాస్త్ర పరిషత్ 78వ వార్షిక సభ సందర్భంగా రాజమండ్రి కోరుకొండ రోడ్ లోని శ్రీరామ కృష్ణ మఠం సభా మంటపంలో నిర్వహిస్తున్న ఉపాన్యాసాలలొ భాగంగా రెండవరోజు మంగళవారం సాయంత్రం బ్రహ్మశ్రీ మంగిపూడి వేంకట శాస్త్రి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ ప్రభల సుబ్రహ్మణ్య శర్మ స్వాగతం పలికారు. ‘సంధ్యావందన వైశిష్ట్యం’ అనే అంశంపై శ్రీ శర్మ ప్రసంగించారు. వాస్తవానికి ఈ అంశంపై బ్రహ్మశ్రీ వి శ్రీరామస లక్షణ ఘనపాఠి ప్రసంగించాల్సి వుంది. అయితే ఆయన రాలేకపోవడంతో శ్రీ శివరామ కృష్ణ శర్మ ప్రసంగం చేసారు.
‘యోగ శాస్త్రంలో ప్రాణాయామం గురించి వుంది. ఇది పరమ తపస్సు లాంటిది. ప్రాణం – మనస్సు ఈ రెండూ, కల్సే వుంటాయి. ఒకదాన్ని ఆపితే , రెండవది కూడా ఆగిపోతుంది. జీవితానికి సార్ధక్యం కల్గించడానికి ప్రాణాయామం ముఖ్యం . ప్రాణాయామం వలన మనస్సు యొక్క చాంచలత్వం తగ్గుతుంది. ఫలితంగా మంత్రంపై లగ్నం పెరుగుతుంది. 7వ ఏట ఉపనయన సంస్కారం చేసి , సంధ్యావందనం గురించి నేర్పుతారు. అర్ధం తెల్సుకుని సంధ్యావందనం చేస్తే , అది మనిషిని మనీషిగా , మహాత్మునిగా మార్చేస్తుంది. భక్తి, జ్ఞానం , కళలను రంగరించి సంధ్యావందనం గా ఏర్పాటుచేశారు’ అని శివరామ కృష్ణ శర్మ వివరించారు. మెకాలే విద్యావిధానం వలన మనదైన సంస్కృతికి విరుద్దంగా బోధన సాగుతూ వస్తోందని ఆయన విచారం వ్యక్తం చేసారు. అయితే పరమ చైతన్యం పొందిన మహనీయుల సంపర్కం వలన, వారి దివ్యత్వం వలన, మన సంస్కృతీ అవిచ్చిన్నంగా కొనసాగుతూ వస్తోందని ఆయన అన్నారు. శర్మ, శ్రీమతి రమణి , సర్వశ్రీ కె శ్రీరాములు, కాలనాధభట్ల సత్యనారాయణ మూర్తి , పెమ్మరాజు గోపాలకృష్ణ , జోరా శర్మ , డాక్టర్ రేమెళ్ళ రామ సోమయాజులు, ప్రయాగ సుబ్రహ్మణ్యం , అడబాల మరిడయ్య , తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.