సత్యంబాబు కళ్ళల్లో ఆనందం

న్యాయం గెలిచింది – అందరికీ కృతజ్ఞతలు
జైలు నుంచి విడుదలైన సత్యంబాబు వ్యాఖ్య

satyambabu copysatyambabu.1
” న్యాయం గెలిచింది. ఇప్పటికి నాకు న్యాయం జరిగింది. నా కుటుంబం చాలా దీనావస్థలో ఉంది. నేను లేకపోతే నా తల్లి, నా చెల్లి ఏమైపోతారో నాకు తెలుసు…నేను జైలుకు వచ్చినప్పటి నుంచి నా తల్లి ఎంతో కష్టపడి చెల్లెల్ని పెంచింది. అయితే నా తల్లి రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేను…కన్న పేగు బాధ నాకు తెలుసు. 9ఏ ళ్ళ తర్వాత నా తల్లి స్పర్శను మళ్ళీ తాకా. మొదటి నుంచి నా కేసు విషయంలో సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు’ అని ఆయేషా మీరా హత్య కేసులో ఎనిమిదిన్నరేళ్ళు జైలు శిక్ష అనుభవించి హైకోర్టు తీర్పుతో నిర్ధోషిగా తేలిన పిడతల సత్యంబాబు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యాడు. సత్యంబాబు నిన్ననే విడుదలవుతారని భావించినా జైలు సూపరింటెండెంట్‌కు ఈరోజు ఉదయం విడుదల ఉత్తర్వులు అందడంతో ఉదయం 10-30 గంటలకు జైలు అధికారులు అతడిని విడుదల చేశారు. కుమారుని విడుదల కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న అతని తల్లి మరియమ్మ కుమారుడ్ని చూసి పట్టరాని ఆనందంతో కన్నీరు మున్నీరైంది. ఉద్విగ్న క్షణాలు రాజ్యమేలాయి. ఈ సందర్బంగా సత్యంబాబు మాట్లాడుతూ ‘నాలాగే ఎంతో మంది అన్యాయంగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వారందరిపై ప్రభుత్వం దృష్టి సారించి న్యాయం చేయాలి” అని పేర్కొన్నాడు. ఆయేషా హత్య కేసులో తనకు ప్రమేయం లేదని ముందు నుంచి ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారని, తన కేసు విషయంలో వారెంతో సహాయం చేశారని పేర్కొన్నారు. సత్యంబాబు విడుదల సందర్భంగా మాజీ ఎం.పి. జీవి హర్షకుమార్‌, దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, రాజమహేంద్రవరం బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షులు ముప్పాళ్ళ సుబ్బారావు, దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకుని సత్యంబాబును పలుకరించి అతడిని అభినందించారు.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=satyam+babu&*

https://www.google.co.in/search?q=sarikotha+samacharam&oq=sa&aqs=chrome.3.69i60l3j69i59j69i60j69i59.1827j0j7&sourceid=chrome&ie=UTF-8

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.