సబ్‌ కలెక్టర్‌ ఆలోచనతో ‘వాల్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌’

స్వచ్చంద సంస్థల సహకారం – అభినందించిన ప్రజాప్రతినిధులు

patabbattal patabbattalupatabbattalu-jpg2patabbattalu-jpg3

రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ శ్రీమతి విజయ కృష్ణన్ సూచనతో జెసిఐ రాజమహేంద్రవరం, స్వర్ణాంధ్ర సేవా సంస్థ, అమ్మా భగవాన్, జైన్ సేవా సంఘం సంయుక్త ఆధ్యర్యంలో పేదలకు పాతబట్టలు తదితర వస్తువుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇంటిలో ఉండే పాతబట్టలను సేకరించి వాటిని పేదవారికి అందించే కార్యక్రమాన్ని గురువారం ఉదయం పుష్కరఘాట్‌ వద్ద ప్రారంభించారు.వాల్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌ పేరిట ప్రారంభించిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించడంతోపాటు ప్రజాప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపించారు.
స్వర్ణాంధ్ర సేవా సంస్థ కార్యదర్శి శ్రీ గుబ్బల రాంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రూరల్‌ ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ శ్రీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ శ్రీమతి పంతం రజనీ శేషసాయి, కమిషనర్‌ శ్రీ వి. విజయరామరాజు, సబ్‌ కలెక్టర్‌ శ్రీమతి విజయకృష్ణన్‌, ఆర్‌టిఓ సిరి ఆనంద్‌, డిప్యూటీ మేయర్‌ శ్రీ వాసిరెడ్డి రాంబాబు పాల్గొన్నారు. పాత బట్టలను సేకరించే బాధ్యతను స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకులు గుబ్బల రాంబాబు, జెసిఐ రాజమండ్రి అధ్యక్షులు దొంతంశెట్టి సుధాకర్‌, హెల్పింగ్‌ హ్యాండ్‌ నిర్వాహకులు అనూప్‌ జైన్‌, రాజమండ్రి సన్‌ రైజర్స్‌, జైన్‌ సేవా సంఘం నిర్వాహకులు విక్రమ్‌జైన్‌, అమ్మా భగవాన్‌ ప్రతినిధులు చేపట్టారు.
సబ్‌ కలెక్టర్‌ చేసిన ఆలోచన చాలా మంచిదని, దీనిని కొనసాగించాలని ప్రజాప్రతినిధులు సూచించారు. ప్రజా పరిపాలనతోపాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని, వస్త్రాలతోపాటు పాత వస్తువులు, పుస్తకాలు, పెన్నులు, ఫర్నీచర్‌ వంటి వాటిని అందిస్తే వాటిని అవసరమైన పేదలకు చేరేలా స్వచ్చంద సంస్థలు కృషిచేస్తాయన్నారు. సేకరించిన వాటిని నిల్వ చేసుకునేందుకు నగరపాలక సంస్థకు చెందిన షాపులను ఇవ్వాలని సూచించారు. శ్రీ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ వస్త్రాల సేకరణకు, వృద్ధులను ఆసుపత్రుల్లో చేర్చేందుకు తెదేపా యువ నాయకులు ఆదిరెడ్డి వాసు అంబులెన్స్‌ను ఉచితంగా స్వర్ణాంధ్రకు అందించేందుకు హామీనిచ్చారని ఈ సందర్బంగా ప్రస్తావించారు.
ఈ కార్యక్రమం విజయవంతానికి శ్రీకన్య గ్రాండ్‌ అధినేత శ్రీ వి.సూర్యనారాయణరాజు ఎంతగానో సహకరించారన్నారు. జెసిఐ సుధాకర్‌ మాట్లాడుతూ సబ్‌ కలెక్టర్‌ పిలిచి కార్యక్రమం చేయాలని కోరినప్పుడు మంచి ఆలోచనకు స్వాగతించామని, ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరుగుతుందని తాను ఊహించలేదన్నారు. అనూప్‌ జైన్‌ మాట్లాడుతూ పాత వస్త్రాలే కాకుండా నిరుపేదలైన వారికి వైద్య సేవలు, పేద విద్యార్ధులకు విద్యాదానం చేస్తామన్నారు. సుమారు ఐదువేలమంది పేదలు పుష్కరఘాట్‌కు చేరుకుని సేకరించిన వస్త్రాలను అందుకున్నారు.

sab
కాగా కార్యక్రమానికి ముందు నగరపాలక సంస్థ కమిషనర్‌ విజయరామరాజు తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని గమనించిన సబ్‌ కలెక్టర్‌ విజయకృష్ణన్‌ దీపావళిని పురస్కరించుకుని స్వచ్చంద సంస్థల సహకారంతో వాల్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌ చేపట్టారని తెలిపారు. పాత బట్టలు ఇవ్వాలనుకునేవారు పుష్కర ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో స్వచ్చంద సంస్థల ప్రతినిధులకు అందించాలని, వాటిని పేదలకు అందజేస్తామన్నారు. దీపావళి వరకు దీనిని కొనసాగిస్తామన్నారు. సబ్‌ కలెక్టర్‌ విజయకృష్ణన్‌ మాట్లాడుతూ ఇచ్చే పాత వస్త్రాల్లో చినిగిన వాటిని కుట్టేందుకు టైలర్‌ను, వాటిని శుభ్రం చేసేందుకు దోబీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, కార్పొరేటర్లు తంగెళ్ళ బాబి, కోరుమిల్లి విజయశేఖర్‌, ద్వారా పార్వతి సుందరి, నిమ్మలపూడి గోవింద్‌, శ్రీకన్య గ్రాండ్‌ సూర్యనారాయణరాజు, విక్రమ్‌ జైన్‌, బొప్పన వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

 

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=gorantla%20buchaiah%20chowdary

https://www.google.co.in/searchq=raghaveeyam&oq=ragha&aqs=chrome.1.69i60j69i59j69i60l2j69i57j69i60.2859j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv%20raghavarao

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=rajahmundry%20municipal%20corporation

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.