సమకాలీనం

నేటి బాలలు 

పదో తరగతికే ముదిరిపోతున్నారు 

అత్యాచారంలో అగ్రగాములు 

సామూహిక అనాచారంలో గ్రంథసాంగులు 

తేడా వస్తే ప్రాణాంతక హంతక చక్రవర్తులు 

మైదానంలో ముష్టి ఘాతాలు , మల్ల యుద్ధాలు 

మైనర్ విద్యార్ధి దుర్మరణం ….

ఇవన్నీ నేటి ‘హిట్ ‘ సినిమాల నుండి 

దిగుమతైన విష సంస్కృతులు –

సినిమాలు చూసి ప్రేమలో పడ్డంకాదు 

అంతకు మించి 

దుష్కర ముష్కర చేష్టలు ,

వంచక కీచక చర్యలు 

పసి హృదయాల మీద ప్రస్ఫుట ముద్రలు 

నేటి బాలలే రేపటి నాయకులు 

కాదు కాదు తాజాగా సినిమా ఫక్కీ ప్రతినాయకులు ?!

05

 

 

 

 

 

జోరా శర్మ 

94406 84086

 

 

 

About The Author

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.