సమకాలీనం(25.12.15 సంచిక)

ranganadh

రంగనాధ ‘రామాయణం’!
(ఆ మరణం ఒక ప్రశ్నార్ధకం )
ప్రేమ పేరుతో మోసపోయిన
ఆభాగిని విధ్యార్దినిలా ,
అప్పుల భారం మోయలేని
అన్నదాతలా ,
కాల్ మనీ వలలో చిక్కిన
మధ్యతరగతి చిరుచేపలా,
చతికిలపడ్డ కెరటంలా ,
ఓడిపోయి రాలిపోయిన
‘ఉదయ కిరణంలా’
తిరుమల సుందర రంగనాధం!
అందరిలా
నువ్వూ అంత పనిచేశావా?
నిరంతరం సీరియల్లా సాగాల్సిన
నీ జీవితానికి – అంతలోనే
ఆఖరి ఎపిసోడ్ గా – నీకు నువ్వే
“స్క్రిప్టు ” రాసుకున్నావా?
జీవితం సత్యం శివం సుందరం –
ఇది తెలిసిన కవులు కూడా
కావాలని మృత్యువునే
కౌగిలించుకుంటే
ఇక కన్నీళ్ళకు కరువే!
అది సమాజానికి అడుగంటిన పరువే!
ఇది వృద్ధ్యాప్యపు భయంకర ఏకాంతం కసిగా
ఎక్కుపెట్టిన ప్రశ్న!
ఏ వృద్ధాశ్రమం
ఆర్చలేని , తీర్చలేని సమస్య !!
రెక్కలొచ్చి
ఎగిరిపోతున్నామనుకుంటున్న
జవాబుదారీ సంతానం జవాబు కోసం
వినూత్న ‘గూగుళ్ళు’ వెతకాల్సిన ప్రశ్న!!
ఫేస్ బుక్ లు ‘మడిచి’
విశ్లేషించాల్సిన ఘటన!!

jora sarma

జోరా శర్మ 94406 84086

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.