సాంస్కృతిక వారసత్వానికి నిలువెత్తు నిదర్శనం వై.ఎస్ఎన్

 వై ఎస్ నరసింహారావు అశీతి మహోత్సవంలో డిప్యూటీ స్పీకర్ బుద్ధప్రసాద్ 

ysnysysn2ysn3

ysn4
‘రాజమహేంద్రిని విస్మరిస్తే రాష్ట్ర చరిత్ర లేదు. ఇక్కడి చరిత్ర వసి వాడకుండా, సాంస్కృతిక జ్యోతిని కాపాడుతున్న వ్యక్తి శ్రీ వైఎస్ నరసింహారావు. ఇక్కడి చరిత్ర గుర్తులు చెరిగిపోకుండా కాపాడుతున్నారు. రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం, కందుకూరి జన్మగృహం ఇలా సజీవంగా నిలవడటానికి శ్రీ వైఎస్ నరసింహారావు చేసిన కృషి అమోఘం’ అని ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆంధ్రకేసరి యువజన సమితి వ్యవస్థాపకులు,పురప్రముఖులు శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు 80 వ పుట్టినరోజు(అశీతి) సందర్బంగా అక్టోబర్ 1 శనివారం రాత్రి గోదావరి గట్టు టి.నగర్ శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవాసమితి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు శ్రీ బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసారు.’తెలుగుజాతి పౌరుషానికి ప్రతీక టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అంధ్రకేసరిని స్ఫూర్తిగా తీసుకుని యువజన సమితి పెట్టడం ద్వారా శ్రీ వైఎస్ నరసింహారావు ఎన్నో కార్యక్రమాలు చేసారు. డబ్బు, పదవి లేకున్నా సరే ఎన్నో చేసి చూపించారు. సామాన్యుడు అసామాన్య కార్యక్రమాలు చేయగలడని నిరూపించారు. శ్రీ వై.ఎస్.ఎన్ స్ఫూర్తితోనే అవనిగడ్డలో గ్రామీణ యువజన వికాస సమితిని స్థాపించాను’ అని ఆయన పేర్కొన్నారు. నూరు వసంతాలు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఎంపీ శ్రీ మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ శ్రీ వైఎస్ నరసింహారావు వందేళ్ల పండుగ జరుపోకోవాలని ఆకాంక్షించారు. ఎం. ఎల్. సి శ్రీ సోము వీర్రాజు మాట్టాడుతూ శ్రీ వైఎస్ నరసింహారావు మీద ఆంధ్రకేసరి ప్రకాశం ప్రభావం చాలా ఉందని అందుకే ధైర్యంగా చాలాపనులు చేయగలిగారని అన్నారు. కొంతమందితో కబడ్డీ కూడా అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. ఎం.ఎల్.సి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ, శ్రీ నరసింహారావు అందిస్తున్న సాంస్కృతిక సేవలు అద్వితీయమన్నారు. శ్రీ నరసింహారావుని సారధ్య సంఘం ఇంటినుంచి ఊరేగింపుగా ఇండియా ఇండిపెండెన్స్ సెంటర్ కి తీసుకు వచ్చి , అక్కడ నుంచి సభా వేదికకు తోడ్కొని సభా వేదిక దగ్గరకు తీసుకొచ్చారు. సభకు సారధ్య సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ ఫణి నాగేశ్వరరావు స్వాగతం పలికారు. సారధ్య సంఘ అధ్యక్షులు డాక్టర్ కర్రి రామారెడ్డి దాదాపు 40నిమిషాలసేపు శ్రీ వైఎస్ జీవన రేఖల పేరిట రూపొందించిన మల్టీమీడియా ప్రదర్శన ఇచ్చారు.
తనకన్నా పెద్దవాళ్లకు సత్కారం
ఇక ఈ వేడుకలో తనకన్నా పెద్దవాళ్ళైనా మాజీ ఎం ఎల్ ఏ శ్రీ చిట్టూరి ప్రభాకరచౌదరి(95 సంలు), స్వాతంత్ర్య సమర యోధులు శ్రీ ముళ్ళపూడి సూర్యనారాయణ(93 సంలు), వైద్యులు డాక్టర్ పెద్దింటి సీతారామ భార్గవ(92 సంలు),విద్యావేత్త ఆచార్య జోస్యుల సూర్య ప్రకాశరావు (89 సంలు), సీనియర్ న్యాయవాది శ్రీ పోతుకూచి సూర్యనారాయణ మూర్తి(87 సంలు), నాణాల సేకరణ కర్త శ్రీ పేరిచర్ల సూర్యనారాయణ రాజు(84 సంలు), ఆడిటర్ శ్రీ ద్రోణంరాజు సుందర రామారావు (81సంలు) లను శ్రీ వై.ఎస్.ఎన్. సత్కరించారు. శ్రీ యాతగిరి రవితేజ సహకరించారు.
ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
తెలుగు వెలుగు డాక్టర్ అరిపిరాల నారాయణరావు సంపాదకత్వంలో శ్రీ వైఎస్ నరసింహారావు పై రూపొందించిన ప్రత్యేక సంచికను ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్; శ్రీ వైఎస్ రచించిన నృసింహ ప్రశ్నఉపనిషత్ తృతీయ ముద్రణను మాజీ ఎంపీ శ్రీ ఉండవల్లి అరుణకుమార్, స్వాతంత్ర్య సమరంలో వీరవనితలు పుస్తకాన్ని మాజీ ఎం ఎల్ ఏ శ్రీ కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. శ్రీ వైఎస్ నరసింహారావు గురించి డాక్టర్ అరిపిరాల నారాయణరావు రచించిన ఎదురీత పుస్తకాన్ని అశీతి ఉత్సవ సారధ్య సంఘ గౌరవ అధ్యక్షులు పురప్రముఖులు శ్రీ డి బి వేంకటపతి రాజు, ఆవిష్కరించారు. ఇన్ కం టాక్స్ ప్రిన్సిపాల్ కమీషనర్ శ్రీ మేడిశెట్టి తిరుమల కుమార్ ఇన్ కం టాక్స్ ప్రిన్సిపాల్ కమీషనర్ శ్రీ జివి గోపాలరావు, సుప్రసిద్ధ సాహితీ వేత్త శ్రీ రాపాక ఏకాంబరాచార్యులు, మాజీ ఎం.ఎల్.సి. శ్రీ కందుల దుర్గేష్, సారధ్య సంఘం గౌరవ మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ విశ్వనాధ గోపాలకృష్ణ శాస్త్రి, భారత భారతి ఆచార్య శలాక రఘునాధ శర్మ, ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షురాలు శ్రీమతి కోసూరి చండీప్రియ,సారధ్య సంఘ కోశాధికారి శ్రీ పొలసానపల్లి జగ్గారావు, ఆతిధ్య సంఘ సభ్యులు- కార్పొరేటర్ శ్రీ మాటూరి రంగారావు, కార్పొరేటర్ శ్రీ కొమ్మా శ్రీనివాసరావు, ప్రకాశం జాతీయ పరిషత్ కార్యదర్శి శ్రీ బయపుర్నేని సూర్యనారాయణ వేదికపై ఆశీనులయ్యారు.
గౌతమీని జాతీయ గ్రంధాలయంగా మార్చాలి
‘ఈ రాష్ట్రంలో జాతీయ గ్రంధాలయం చేయడానికి అన్ని అర్హతలు గల ఏకైక గ్రంధాలయం శ్రీ గౌతమీ ప్రాంతీయ గ్రంధాలయం. దీన్ని జాతీయ గ్రంధాలయంగా మార్చడానికి సిటీ ఎం.ఎల్.ఏ. డాక్టర్ ఆకుల సత్యనారాయణ కృషి చేస్తున్నారు. దీనికి ఎంపీ శ్రీ మురళీమోహన్ తోడ్పాటు అందించాలి’ అని శ్రీ వై.ఎస్. నరసింహారావు కోరారు. అలాగే భవిష్యత్తులో ఇటు సీతానగరం నుంచి అటు రావులపాలెం వరకూ కలసిపోయి, మహా రాజమహేంద్రిగా రూపుదిద్దకుంటుందని ఆయన విశ్లేషించారు. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని, రామకృష్ణ థియటర్ వెనుక ఆవలో 5ఎకరాలు సేకరించి మహా రాజమహేంద్రి కోసం అక్కడ ఆఫీసు కట్టాలని అన్నారు. రాజమండ్రిని రాజమహేంద్రవరం గా మార్చి జీవో ఇచ్చినప్పటికీ ఇంకా కేంద్రం ఆమోదం తెలపాలని అందుకే, పునరాలోంచి, రాజమహేంద్రిగా మార్చాలని ఆయన కోరారు. ఇందుకు సంబంధించి చారిత్రిక శాసనం ఉందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ లోని పాత మ్యూజియం హాలుని పడగొట్టకుండా చూడాలని, చారిత్రిక కట్టడమైన దాన్ని పరిరక్షించాలని ఆయన కోరారు. ఫారెస్ట్ దగ్గర ఒక జూ ఏర్పాటుచేయాలని సూచించారు. అనంతరం శ్రీ వైఎస్ నరసింహారావుని పలువురు ఘనంగా సత్కరించారు. పూలమాలతో, దుశ్శాలువాలతో ముంచెత్తారు.
సారధ్య సంఘ ఉపాధ్యక్షులు సర్వశ్రీ మద్దూరి శివ సుబ్బారావు, , కుమారి పాణంగిపల్లి సుభద్ర, డాక్టర్ ఎన్. జోగేశ్వర రావు, కార్యదర్శి శ్రీ జమ్మి రామారావు, సహాయ కార్యదర్శిలు సర్వశ్రీ కొప్పర్తి రామకృష్ణ , షేక్ అసదుల్లా అహ్మద్, డాక్టర్ పి.ఎస్ రవికుమార్, సన్నిధానం శాస్త్రి, ప్రత్యేక సంచిక సహ సంపాదకులు శ్రీ పెరుమాళ్ళ రఘునాధ్, శ్రీ వి ఎస్ ఎస్ కృష్ణకుమార్, ఆతిధ్య సంఘం సభ్యులు సర్వశ్రీ ఆకుల వీర్రాజు, తేతలి వెంకటేశ్వరరావు, మేడిశెట్టి తాతబ్బాయి, బలభద్ర పాండురంగ వెంకట్రాజు, కందాళం వెంకట సుబ్బారావు, తొక్కుల రామాంజనేయులు,ఇమంది శ్రీరాములు,డాక్టర్ చల్లా హైమావతి, డాక్టర్ అనసూరి పద్మలత, మాదిరాజు శ్రీనివాస్,జెవి ఎస్ పి పూర్ణానందరావు,వేదుల శేషగిరి వరప్రసాద్,మారిశెట్టి సత్యనారాయణ(జిల్లా గ్రంధాలయ కార్యదర్శి), అశోక్ కుమార్ జైన్, ఎస్పీ గంగిరెడ్డి, దినవహి బాపిరాజు, నల్లగొండ రవిప్రకాష్, దేశిరెడ్డి బలరామ నాయుడు, డిఎస్ రాజేశ్వరరావు, రవి పరస, వజ్జల అప్పయ్య శాస్త్రి, జోరా శర్మ, రామ్ కుమార్,
యార్లగడ్డ మోహనరావు, ఎస్.బి.చౌదరి, మార్గాని రామకృష్ణ గౌడ్, ఎం నాగేశ్వరరావు,బొమ్ముల దత్తు, గరిమెళ్ళ చిట్టిబాబు, ధార్వాడ రామకృష్ణ,పెదిరెడ్ల శ్రీనివాస్, కార్టూనిస్టు శేఖర్, ముంగండి సూర్యనారాయణ, గుదే రఘు నరేష్, ముత్యాల పెదబాబు,జాగరపు సత్యనారాయణ, కూరెళ్ల గంగరాజు, విటివి సుబ్బారావు, ఆంధ్రకేసరి సంస్థల సభ్యులు, ప్రముఖులు, శ్రీ వై.ఎస్.ఎన్. కుటుంబ సభ్యులు, బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv%20raghavarao

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=yatagiri%20sri%20rama%20narasimharao

https://www.youtube.com/watch?v=NDylDNDhuUQ&feature=share

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.