సార్వత్రిక సమ్మె విజయవంతం

ఇకనైనా కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకోవాలి
లేకుంటే గుణపాఠం తప్పదన్న కార్మిక సంఘాలు
       1211 దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2న చేపట్టిన సార్వత్రిక సమ్మెలో సుమారు దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొని కేంద్రప్రభుత్వానికి గట్టి హెచ్చరికను జారీ చేశారని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటూ , ఇప్పటికైనా కార్మికవర్గం న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేసేందుకు కేంద్రప్రభుత్వం దిగిరాకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. హెచ్చరించారు. ఎఐటియుసి, సిఐటియు, ఐఎఫ్‌టియు, ఐఎన్‌టియుసిలతోటు, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్సు, పోస్టల్‌, రైల్వే, విమానాయానం వంటి కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం రాజమండ్రిలో కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీలు, జట్లు లేబర్‌, భవన నిర్మాణ, ఆటో, సంఘటిత, అసంఘటిత కార్మికులు ఐక్య ప్రదర్శనను నిర్వహించారు. కోటగుమ్మం సెంటర్‌ నుంచి మెయిన్‌ రోడ్డు మీదుగా డీలక్స్‌ సెంటర్‌, శ్యామలాసెంటర్‌ మీదుగా కోటిపల్లిబస్టాండు వరకూ కార్మికులు కదం తొక్కారు. అనంతరం కోటిపల్లిబస్టాండులో జరిగిన బహిరంగ సభకు ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు శ్రీ మీసాల సత్యనారాయణ, సిఐటియు జిల్లా ఉపాధ్యాక్షుడు శ్రీ బిబి నాయుడు, ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షుడు శ్రీ కె.జోజి, ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు శ్రీ ఎన్‌వి శ్రీనివాస్‌ అధ్యక్షత వహించారు.
           ముఖ్య అతిథిగా ఎఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆర్‌.రవీంద్రనాధ్‌, సిఐటియు జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, బ్యాంకింగ్‌ సెక్టార్‌ నుంచి లక్ష్మీపతి, ఇన్సూరెన్స్‌ రంగం నుంచి పి.సతీష్‌లు పాల్గొని మాట్లాడుతూ , కేంద్ర కార్మిక సంఘాలు చేసిన డిమాండ్లను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్ల్యక్షంగా వ్యవహరిండం వల్లే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను నిర్వహించాల్సివచ్చిందన్నారు. సమ్మెను విఫలం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కార్మికుల డిమాండ్లను అంగీకరించిందని దుష్పచారం నిర్వహించిందని పేర్కొన్నారు. బిజెపికి అనుకూలమైన సంఘాలతో సమ్మె విఫలానికి ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రభుత్వానికి ఫలితం దక్కలేదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీసంగా నెలసరి వేతనం రరూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తే కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.ఏడు వేలు మాత్రమే ఇస్తామని చెప్పిందన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను సవరణల పేరుతో కార్మికుల హక్కులను కాలరాసేందుకు ప్రయత్నాలను చేస్తోందని ఆరోపించారు. సమ్మె చేసే హక్కు లేకుండా సవరణలు చేస్తే కార్మికవర్గం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. వివిధ కార్మిక, ఉద్యోగ సంఘాలకు చెందిన నాయకులు గెద్దాడ హరిబాబు, కిర్ల కృష్ణ, ఎవి సత్యనారాయణ, గెడ్డం రమణ, ఎస్‌ఎస్‌ మూర్తి, శెట్టి లచ్చాలు, భాగ్యలక్ష్మి, రవి, ఎం.సత్యనారాయణ, తదితరులు మాట్లాడారు. మరోపక్క ఎస్ ఎఫ్ ఐ విద్యా సంస్థల బంద్ కి పిలుపునివ్వడంతో ముందుగానే విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.