వ్యవస్థాపకుల్లో మిగిలిన పోతుకూచికి సత్కారం
సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో ఆరు దశాబ్దాల కిందట ఆవిర్భవించి , ఎన్నో సాహిత్య రచనలకు, ఎంతోమంది సాహితీవేత్తలకు ఊతమిచ్చిన సాహిత్య గౌతమి సంస్థ ఇప్పుడు అరవై ఏళ్ళు పూర్తిచేసుకోవడంతో గోదావరి ప్రభ సంపాదకులు శ్రీ వారణాసి సుబ్రహ్మణ్యం చొరవ తీసుకుని సాహితీ మిత్రులు, సాహితీ ప్రియులు కల్సి శనివారం ఉదయం సాహిత్య గౌతమి షష్టి పూర్తిమహోత్సవం నిర్వహించారు. ఆత్మీయ పూరిత వాతావరణంలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ప్రెసిడెంట్, ఆర్ ఎస్ వెంచర్స్ పార్టనర్ శ్రీ కె లక్ష్మీప్రసాద్ అతిధిగా హాజరయ్యారు. కళా గౌతమీ వ్యవస్థాపకులు డాక్టర్ బివిఎస్ మూర్తి , ఆచార్య శలాక రఘునాధ శర్మ, ఎర్రాప్రగడ రామకృష్ణ , డాక్టర్ అరిపిరాల నారాయణరావు, డాక్టర్ ఎస్వీ రాఘవేంద్రరావు , డాక్టర్ అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు, డాక్టర్ ప్రభల సుబ్రహ్మణ్య శర్మ , పెరుమాళ్ళ రఘునాధ్, డాక్టర్ డి ఎస్ వి సుబ్రహ్మణ్యం, ఎస్పీ గంగిరెడ్డి , హిందూ భాస్కర్ , మరా శాస్త్రి , గోపాలాచార్య, గ్రంధి రామచంద్రరావు , సప్పా దుర్గాప్రసాద్ , యార్లగడ్డ మోహనరావు , గురజాల హనుమంతరావు, వాడ్రేవు మల్లపరాజు , మధుర పాల శంకర శర్మ , సూర్య కృష్ణకుమార్ ,ప్రజాపత్రిక సుదర్శన్ , చింతల గోపాలరావు , జోరా శర్మ , రమణీ కుమారి, మాదిరాజు శ్రీనివాస్ , జె కాళేశ్వరరావు , ఖండవల్లి అప్పల రామమూర్తి , న్యాయవాది శ్రీనివాసరావు, ఖండవిల్లి అప్పల రామమూర్తి , డి ఎస్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో అరవై ఏళ్ళ చరిత్ర గల సాహిత్య గౌతమి సేవలను వక్తలు కొనియాడారు. సాహిత్య గౌతమి చేసిన వివిధ కార్యక్రమాలను శ్రీ పోతుకూచి వివరిస్తూ , ఆనాటి విషయాలను గుర్తుచేసుకున్నారు. కొందరు కవులు పద్య రత్నాలు సమర్పించారు. అనంతరం శ్రీ పోతుకూచిని పలువురు ఘనంగా సన్మానించారు.
Related posts
Leave a Reply
Leave a Reply
You must be logged in to post a comment.