సాహోరే.. బాహుబలీ .. Saahore Baahubali

 బాహుబలి:  ది కంక్లూజన్’ 
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తేల్చేసింది
bahubali2bahubali
 ఫ్లాష్ బ్యాక్ సినిమా … అందునా భారీ  వ్యయంతో, భారీ అంచనాలతో విడుదలైన సినిమా  ‘బాహుబలి: ది కంక్లూజన్’. గోదావరి పుష్కరాల నేపథ్యంలో విడుదలైన బాహుబలి అద్భుత విజయాన్ని నమోదుచేసుకుంది. భారతీయ సినిమా చరిత్రలో బాహుబలి రికార్డులు బద్దలు కొట్టింది. జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకుంది. అయితే ఈ సినిమాలో ఓ సస్పెన్స్ ఉంచి, అది ఏమిటో తెలియాలంటే  ‘బాహుబలి: ది కంక్లూజన్’ చూడాల్సిందేనంటూ ఓ ఫజిల్ ప్రేక్షకుల ముందు ఉంచాడు చిత్ర దర్శకుడు రాజమౌళి. అందుకే తెలుగు అని కాదు.. తమిళం అని కాదు.. హిందీ అని కాదు.. దేశంలో ఏ భాషకు చెందిన ప్రేక్షకులైనా సరే.. ఇప్పటిదాకా మరే సినిమాకూ ఎదురు చూడనంతగా ‘బాహుబలి: ది కంక్లూజన్’ కోసం ఎదురు చూశారంటే, అందులో ఏమాత్రం  అతిశయోక్తి లేదు. ఆకాశాన్నంటే అంచనాలు అన్నా సరే.. ‘బాహుబలి-2’ విషయంలో తక్కువే అయిపోతుందేమో. అంతగా ఉత్కంఠ రేపిందీ సినిమా. ఎట్టకేలకు ఈ ఉత్కంఠకు.. నిరీక్షణకు తెరపడింది. ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బాహుబలిలో వదిలిన సస్పెన్స్ కట్టప్ప ‘బాహుబలిని ఎందుకు చంపాడో కంక్లూజన్ తేల్చి చెప్పేసింది. ఇందులో నటీనటులు, ఇతర సాంకేతిక వర్గం విషయానికి వస్తే,
నటీనటులు: ప్రభాస్ – రానా దగ్గుబాటి – అనుష్క – రమ్యకృష్ణ – సత్యరాజ్ – నాజర్ – సుబ్బరాజు – తమన్నా తదితరులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
ఛాయాగ్రహణం: సెంథిల్ కుమార్
మాటలు: విజయ్ కుమార్ – అజయ్ కుమార్
ప్రొడక్షన్ డిజైన్: సాబు సిరిల్
వీఎఫెక్స్ సూపర్ వైజర్: కమల్ కణ్ణన్
కథ: విజయేంద్ర ప్రసాద్
నిర్మాతలు: శోభు యార్లగడ్డ – ప్రసాద్ దేవినేని
స్క్రీన్ ప్లే – దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి
కథ విషయానికి వస్తే,
   కాలకేయులతో యుద్ధంలో విజయానంతరం బాహుబలిని శివగామి మహిష్మతికి రాజుగా ప్రకటించడం బాహుబలిలోనే ఉంటుంది. ఇక కంక్లూజన్ లో  పట్టాభిషేకానికి గడువు దగ్గర పడడం దగ్గర నుంచి సినిమా మొదలవుతుంది. పట్టాభిషేకానికి ముందు శివగామి   దేశాటనకు బాహుబలి  బయల్దేరతాడు అతని వెంట కట్టప్ప కూడా ఉంటాడు. ఇక  సింహాసనం తనకు దక్కలేదన్న అక్కసుతో సర్వ సైన్యాధ్యక్షుని హోదాతో సరిపెట్టుకుని పగతో  రగిలిపోతున్న భల్లాలదేవుడు బాహుబలిని ఎలా దెబ్బ తీయాలా అని ఆలోచిస్తుంటాడు. ఇంతలో దేశాటనలో భాగంగా బాహుబలి కుంతల రాజ్యానికి వెళ్లి, అనుకోని పరిస్థితులలో ఆ దేశ యువరాణి దేవసేనను ప్రేమిస్తాడు. ఇక  ఆమె కూడా అతణ్ని ప్రేమిస్తుంది. అయితే మాహిష్మతి రాజ్యానికి తాను కాబోయే రాజుననే విషయం బాహుబలి చెప్పడు.  ఇక వీరిద్దరి ప్రేమ గురించి  దూతల ద్వారా తెలుసుకున్న   భల్లాలదేవుడు తన పగకు కార్యరూపం తెచ్చే యత్నానికి దిగుతాడు. దేవసేన ను ప్రేమిస్తున్నానని , పెళ్లి చేయాలనే ప్రతిపాదన తేవడంతో శివగామి అంగీకరిస్తుంది. ఇంతకీ  బాహుబలి-దేవసేన ప్రేమలో ఉన్నారన్న సంగతి తెలియని శివగామి,  దేవసేనను ఇచ్చి పెళ్లి చేస్తానని  భల్లాల దేవుడికి మాట ఇచ్చేస్తుంది. శివగామి వెంటనే దేవసేనకు ఆభరణాలు పంపిస్తూ, తనకొడుకుని పెళ్ళిచేసుకోవాలని ప్రతిపాదిస్తుంది. అయితే దేవసేన నిరాకరిస్తూ, ఆభరణాలను తిప్పి పంపిస్తుంది. దీంతో దేవసేనను బంధించి తీసుకురావాలని బాహుబలిని  శివగామి ఆదేశిస్తూ వర్తమానం పంపుతుంది. అప్పటికే ఇబ్బందుల్లో ఉన్న కుంతల రాజ్యాన్ని శత్రువుల బారినుంచి బాహుబలి  కాపాడ్డం ద్వారా, తానెవరో చెప్పాల్సి వస్తుంది. విషయం తెలుసుకున్న దేవసేన, శివగామి పంపిన ఆభరణాలను తిరస్కరించడం ద్వారా  తప్పు చేశానని వివరణ ఇస్తుంది. మొత్తానికి  తల్లి శివగామించి వచ్చిన ఆజ్ఞ మేరకు దేవసేనను తీసుకు వెళ్తాడు. ఇక అక్కడ అసలు విషయం తెలుస్తుంది.  అక్కడకు వెళ్ళాక భల్లాల దేవుడికి ఇచ్చి పెళ్ళిచేస్తున్నారన్న విషయం తెల్సుకుని దేవసేన ఎదురుతిరుగుతుంది. ఇచ్చిన మాటకోసం  బాహుబలి కూడా బాసటగా నిలుస్తాడు. అయితే   భల్లాలకు ఇచ్చిన మాట కారణంగా, రగిలిపోయిన శివగామి, అక్కడికక్కడే రాజ్యం కావాలా, దేవసేన కావాలో తేల్చుకో అంటూ హుకుం జారీచేస్తుంది.  బాహుబలికి రాజు కావడమా.. లేక దేవసేనను చేపట్టడమా అన్న మీమాంస ఎదురవుతుంది. అప్పుడతను ఏం చేశాడు.. అతడి నిర్ణయం తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.. అసలు కట్టప్ప బాహుబలిని చంపడం నిజమేనా.. అందుకు దారి తీసిన పరిస్థితులేంటి.. తన నేపథ్యం గురించి తెలుసుకున్నాక శివుడు ఏం చేశాడు? అసలు కధ ఎలా మలుపులు తిరిగింది.  భల్లాలను బతికుండగానే చితి మీద పడుకోబెట్టి కాల్చాలన్న తన తల్లి కోరికను అతను నెరవేర్చాడా.. అనే ప్రశ్నలకు సమాధానం వెండితెరమీదే దొరుకుతుంది. 
    సినిమాకు సంబంధించిన ఊహల విషయంలో మాత్రం రాజమౌళి మాత్రం తన మనసు వెళ్లిన ప్రతి చోటికీ తాను వెళ్లిపోవాలనుకుంటాడు. నిజానికి   మనసు వెళ్లిన చోటకల్లా మనిషి వెళ్లకూడదు అంటారు. కానీ  తన ఊహల్లో రూపుదిద్దుకున్న అందమైన.. అసాధారణమైన దృశ్యాలకు వెండితెర రూపం ఇవ్వడంలో రాజమౌళి రూటేవేరని మరోసారి తేలింది.  ప్రేక్షకుడిని అబ్బుర పరిచి, విస్మయానికి గురి చేయడంలో  ‘బాహుబలి: ది బిగినింగ్’ బానే నడిచింది.  ప్రేక్షకుడికి సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన దృశ్యాలెన్నో ఇందులో కనిపిస్తాయి. తన ఊహలకు ఆకాశాన్నే హద్దుగా చేసుకుని.. వెండితెరపై  కళ్లు చెదిరిపోయే దృశ్యాల్ని ఆవిష్కరించి భారతీయ సినీ ప్రేక్షకుల్ని రాజమౌళి  ఉర్రూతలూగించాడు  దేశాటనకు వెళ్ళమని శివగామి ఆదేశించినపుడు బాహుబలి ఉత్సాహంగా బయలుదేరుతాడు. ‘గుళ్లో విగ్రహాల్ని ప్రతిష్టించే  ముందు ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగిస్తారు. ఎందుకంటే, ప్రజల బాగోగులు దేవుడికి తెలియాలని అలా చేస్తారు. మరి రాజ్యానికి రాజు కాబోయేవాడు, ప్రజల కష్ట సుఖాలు తెల్సుకోవాలి కదా” అంటూ శివగామి పలకడం  కరతాళ ధ్వనులు చేయిస్తుంది. ఇక కట్టప్ప కూడా జోకులు పేల్చడం విశేషం. ‘బాహుబలికి రాజ్యాధికారం కట్టబెడుతున్నారని తెల్సి, ‘ఏరా మీ అమ్మను చంపాలని నీకు అనిపించలేదా?’ అంటూ బిజ్జల దేవుడు అడగడం. ఆతర్వాత వచ్చిన కట్టప్ప, బాహుబలి పట్టాభిషేకం వార్త తీసుకురావడం నేపథ్యంలో కట్టప్పను ‘కుక్క’ అని బిజ్జలదేవుడు  సోంబోధిస్తాడు. అక్కడ కట్టప్ప మాట్లాడిన మాటలు విని తీరాల్సిందే. 
  ఇలా ఒకటి రెండు చోట్ల డైలాగులు పేలాయి. రాజధర్మం గురించి కూడా డైలాగులు ఆకట్టుకుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా 9000 స్క్రీన్లపై ఈ చిత్రం విడుదలై న ఈ సినిమా రాజమండ్రిలో ఇంచుమించు అన్ని థియేటర్లలో షోలు పడ్డాయి. 5షోలు వేశారు. ఇక టికెట్ ధరలు డబుల్ చేసారు.
ramgopal varma
  కాగా ఈ సినిమాపై చిత్ర ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. కాలాన్ని క్రీస్తు పూర్వం (బీసీ), క్రీస్తు శకం (ఏడీ)గా విభజించినట్టుగా.. భారతీయ సినిమాను కూడా బాహుబలికి ముందు (బీబీ), బాహుబలి తర్వాత (ఏబీ)గా పరిగణిస్తారని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.
karan johar
‘ఈ దశాబ్దపు టాప్ డైరెక్టర్ తో నేను. ఈ జీనియస్ తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. మా కాలంలో ఖచ్చితంగా ఇతనే అత్యుత్తమ దర్శకుడు’ అంటూ రాజమౌళితో కలిసి దిగిన సెల్ఫీని కలిపి బాలీవుడ్ దర్శకుడు నిర్మాత కరణ్ జోహర్ ట్వీట్ చేశాడు. ఎంతో మంది లెజెండరీ దర్శకులు ఉండగా రాజమౌళి అత్యుత్తమ దర్శకుడంటూ కరణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సౌత్ తో పాటు నార్త్ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారాయి.
taran adarsh
కాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘బాహుబలి 2’ చిత్రం తొలిరోజున రూ.100 కోట్లు దాటినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ చిత్రం హిందీలో తొలిరోజున అత్యధిక వసూళ్లు సాధించిన సల్మాన్‌ ఖాన్‌ ‘సుల్తాన్‌’, ఆమిర్‌ఖాన్‌ ‘దంగల్‌’ను మించినట్లు సినీ విశ్లేషకుడు తరణ్‌ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. గతంలో ‘సుల్తాన్‌’ రూ. 36.54 కోట్లు, ‘దంగల్‌’ రూ. 29.78 కోట్లు రాబట్టిందని చెప్పారు. ఎటువంటి సెలవు, పండుగ లేకుండా భారీ స్థాయిలో వసూళ్లు రావడం మేజిక్‌ అని తరణ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘బాహుబలి 2’ అన్ని రికార్డులను బ్రేక్‌ చేసి, కొత్త రికార్డు సృష్టిందని చెప్పారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.