సిబి ఐ తో సమానంగా సి ఐ డి పనిచేస్తోందన్న డిజిపి

djp3djp2dgp5dgp

పోలీస్‌ శాఖలోని ఎస్పీ కార్యాలయాలను కాగిత రహిత ఈ-ఆఫీస్‌లను ఏర్పాటు చేస్తున్నామని, ఈ విధానాన్ని తొలిసారిగా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ప్రవేశపెట్టామని డిజిపి శ్రీ జె.వి.రాముడు చెప్పారు. రాష్ట్రంలో పోలీస్‌శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి వృత్తి నైపుణ్యాలను పెంపొందించడానికి సాంకేతికపరమైన అంశాలు, వినియోగంపై శిక్షణ ఇస్తామని తెలిపారు. లాలాచెరువు అర్బన్‌ ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో సిఐడి ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అడిషనల్‌ డిజిపి శ్రీ ద్వారకా తిరుమలరావు, ఐ.జి.లు శ్రీ కుమార్‌ విశ్వజిత్‌, శ్రీ సునీల్‌కుమార్‌, ఏలూరు రేంజి డిఐజి శ్రీ పి.హరికుమార్‌, డి.ఐ.జి శ్రీ సుందర్‌కుమార్‌, అర్బన్‌ ఎస్పీ శ్రీ హరికృష్ణ, సిఐడి ఎస్పీ శ్రీ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పెద్దింటి వెంకట సుబ్బారాయుడు, శ్రీ పెద్దింటి నీలకంఠ శాస్త్రోక్తంగా పూజాదికాలు చేయించారు. అనంతరం డిజిపి మీడియాతో మాట్లాడుతూ సిబి ఐ తో సమానంగా సి ఐ డి పనిచేస్తోందని , అయితే ఇంకా పటిష్ట పరుస్తామని చెప్పారు.  నూతనంగా ఏర్పాటైన రాష్ట్రంలో పోలీస్‌ శాఖకు సంబంధించి వివిధ కార్యాలయాలను దశల వారీగా తరలిస్తున్నామని తెలిపారు. ఇటీవలే సిఐడి ప్రాంతీయ కార్యాలయాన్ని గుంటూరులో ప్రారంభించామన్నారు.  ఈ-క్లిక్‌ విధానం ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించే విధానాన్ని అమలు చేశామని పేర్కొన్నారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా విలీనమైన మండలాల్లో అవసరమైన భద్రతా చర్యలు చేపడతామన్నారు. పోలీస్‌ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. చిత్తూరు మేయర్ కటారి అనూరాధ దంపతుల హత్య గురించి ప్రస్తావించగా , డిజిపి బదులిస్తూ ఈ కేసుని వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కేసులో నిందితుల గురించి ఒక నిర్ధారణకు వచ్చామని , అయితే ఇంకా స్పష్టత రావాల్సి వుందని ఆయన చెప్పారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.