స్కూల్‌ అసిస్టెంట్‌ అసోసియేషన్‌గా మారిన రాష్ట్ర బి.ఇడి అసోసియేషన్‌

school asistents

ఇన్నాళ్ళూ రాష్ట్ర బి.ఇడి అసోసియేషన్‌ గా నడించిన సంఘాన్ని ఇకనుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ అసోసియేషన్‌గా మార్పు చేసినట్లు అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు డివి స్వామిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పరిమి త్యాగరాజు, జిల్లా గౌరవ అధ్యక్షులు వివివి సత్యనారాయణ, నగర అధ్యక్షులు కెఎం రావు, ప్రధాన కార్యదర్శి పి వీర్రాజులు ప్రకతించారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో ఇప్పటి స్కూల్‌ అసిస్టెంట్‌ను బియిడి అసిస్టెంట్‌ అనేవారని, దాంతో బి.యిడి అసోసియేషన్‌గా వ్యవహరించేవారని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం స్కూల్‌ అసిస్టెంట్‌ అని వ్యవహరిస్తున్న నేపధ్యంలో అసోసియేషన్‌ను కూడా స్కూల్‌ అసిస్టెంట్స్‌ అసోసియేషన్‌గా మార్చినట్లు వివరించారు. స్కూల్‌ అసిస్టెంట్స్‌కు ప్రత్యేకమైన కేడర్‌ సంఘం ఉన్నందున స్కూల్‌ అసిస్టెంట్స్‌ అందరూ సబ్జెక్టుతో సంబంధం లేకుండా ఈ సంఘంలో చేరి సంఘాన్ని బలోపేతం చేయాలని కోరారు. సమస్యలు ఉపాధ్యాయులవీ… పరిష్కారం అసోసియేషన్‌ది అనే నినాదంతో పనిచేస్తున్న తమ సంఘం దృష్టికి ఉపాధ్యాయులు తమ సమస్యలను తీసుకురావాలని కోరారు.
స్కూల్‌ అసిస్టెంట్స్‌ అసోసియేషన్‌గా ఉపాధ్యాయుల సమస్యలపై రాజీలేని పోరాటం సాగిస్తామ ని శ్రీ స్వామి రెడ్డి చెప్పారు. విద్యావ్యవస్ధలో స్కూల్‌ అసిస్టెంట్స్‌ పాత్ర కీలకమైందని, విద్యార్ధి భవిష్యత్‌కి ప్రవర్తనావళి మూలమని, అందుచేత స్కూల్‌ అసిస్టెంట్స్‌పై ఉన్న ఒత్తిడిని తొలగించేలా సరళమైన మార్గాలను అన్వేషించవలసిన బాధ్యత అందరిపై వుందని ఆయన చెప్పారు. ఉపాధ్యాయుడిని ఇతర డిపార్టుమెంట్‌లతో పోల్చకుండా అదనపు అర్హతలకు అదనపు ఇంక్రిమెంట్లు, గతంలో మాదిరిగా ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. సకాలంలో ఉపాధ్యాయుల నియామకాలు, బదిలీలు చేపట్టాలని, సక్సెస్‌ స్కూల్స్‌లో, నాన్‌ సక్సస్‌ స్కూల్స్‌లాగానే తెలుగు మీడియం, ఇంగ్లీషు మీడియానికి తగు నిష్పత్తిలో సబ్జెక్టు వారీగా ఉపాధ్యాయులను నియమించాలని కోరారు.
స్కూల్స్‌కు వచ్చే టీమ్స్‌ ఉపాధ్యాయులకు తగు సలహాలు ఇవ్వాలే తప్ప, వారిని నిందించడం, సస్పెండ్‌ చేయడం, మెమోలు ఇవ్వడం మంచిది కాదని శ్రీ స్వామి రెడ్డి అన్నారు. అవసరమైతే టీమ్స్‌ నిర్దేశించిన ఆశయాల సామాగ్రిని ఉపాధ్యాయులు సమకూర్చుకునే విధంగా ఏర్పాట్లు దగ్గర ఉండి చేయించాలని, స్టడీ మెటీరియల్‌ సకాలంలో అందించాలని, అదనపు డ్యూటీల పేరుతో హెచ్‌ఎంలను బయటకు పంపడం వల్ల స్కూల్‌ నిర్వహణ దెబ్బతింటుందని, కావునా హెచ్‌ఎంలకు అదనపు డ్యూటీలు ఇవ్వరాదని, ఎంఇవోల ప్రమోషన్‌లు, జూనియర్‌ లెక్చరర్లు, డైట్‌ లెక్చరర్లు మొదలైన పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్స్‌లతో భర్తీ చేయాలని, హిందీకి పిరియడ్లను పెంచాలని, హెల్త్‌ కార్డులు సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, కంప్యూటర్‌ విద్యను సక్రమంగా కొనసాగించాలని, ప్రతీ స్కూల్‌లో స్కౌట్‌, ఎన్‌సిసిని ప్రవేశపెట్టాలని కోరారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.