‘స్వచ్ఛ గోదావరి’ నినాదం’తో సందడిగా 5 కె రన్‌

   5k run

”స్వచ్ఛ గోదావరి” నినాదంతో ఆదివారం ఉదయం రాజమహేంద్రవరం లో ‘ గోదావరి 5 కె రన్‌’ నిర్వహించారు. మేము సైతం అంటూ భారీగా విద్యార్ధులు ఈ రన్‌లో పాల్గొని పరుగులు తీశారు. శ్రీ నన్నపనేని మురళి నిర్వహణలో ఏర్పాటు చేసిన ఈ 5 కె రన్‌ ని పార్లమెంట్‌ సభ్యులు శ్రీ మాగంటి మురళిమోహన్‌ జెండా ఊపి ప్రారంభించారు. సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, మేయర్‌ శ్రీమతి పంతం రజనీ శేషసాయి, మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్‌ శ్రీ వి విజయరామరాజు , విజయరామరాజు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ కె.వి.వి. సత్యనారాయణరాజు (చైతన్యరాజు), జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాల చైర్మన్‌ డా. గన్ని భాస్కరరావు, ఆదిత్య విద్యా సంస్ధల డైరక్టర్‌ శ్రీ ఎస్‌.పి.గంగి రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, తప్పనిసరిగా ప్రతి రోజు శారీరక వ్యాయామం చేయాలని వక్తలు సూచిస్తూ, యువతలో స్ఫూర్తి నింపేందుకు, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఈ రన్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రన్‌లో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్ధులకు టీ షర్ట్స్‌, టైమర్‌ చిప్స్‌ అందజేశారు. పుష్కర ఘాట్‌ వద్ద ప్రారంభమైన ఈ రన్‌ గోదావరి గట్టు మీదుగా కోటిపల్లి బస్టాండ్‌ వరకు వెళ్ళి తిరిగి పుష్కర ఘాట్‌ వద్దకు చేరుకుంది. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్ధానాలను గెల్చుకున్న విజేతలకు బహుమతులు అందజేశారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.