1నుంచి దేవీచౌక్ లో 83వ శరన్నవరాత్రి మహోత్సవాలు

30న అమ్మవారి ఉత్సవ మూర్తి ప్రతిష్ట
2న 108దంపతులతో  కుంకుమ పూజలు
12తో ఉత్సవాల ముగింపు – 16న అన్న సమారాధన

devichowk
మైసూరు దసరా ఉత్సవాల తర్వాత అంతగా పేరొందిన రాజమహేంద్రవరం దేవీచౌక్ లో గత 82 ఏళ్లుగా శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుండగా, ఈ ఏడాది 83వ దేవి నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 1నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12వరకూ జరిగే ఈ ఉత్సవాల కోసం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 30వ తేదీ రాత్రి 12గంటల 6నిమిషాలకు అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రతిష్టిస్తారు. 1వ తేదీ ఉదయం 8గంటల 48నిమిషాలకు కలశ స్థాపన, కుంకుమ పూజలు జరుగుతాయి. 2వ తేదీన 108 దంపతులతో కుంకుమ పూజలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాల కోసం వివరించడానికి శ్రీ దేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీ తోలేటి ఘనరాజు,కార్యదర్శి శ్రీ పడాల శివరామ లింగేశ్వరరావు(చిన్నబ్బాయి), కోశాధికారి శ్రీ ఆండ్ర నమస్సివాయ శనివారం ఉదయం దేవీచౌక్ శ్రీ దేవి కల్యాణ మంటపంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఉత్సవ కమిటీకి చెందిన సర్వశ్రీ పిల్లి వెంకట రేమేష్,కాలెపు వీరిభద్రస్వామి,గంధం భైరవస్వామి,మేడిశెట్టి కృష్ణారావు తదితరులు హాజరయ్యారు.
అమ్మవారి దయ, ప్రజల సహకారంతో ఉత్సవాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతున్నాయని, పోలీసు – ఆర్ అండ్ బి, మున్సిపల్ అనుమతులు కూడా త్వరితగతిన ఇస్తున్నారని శ్రీ తోలేటి ధనరాజు చెప్పారు. ఈ ఏడాది 83వ శ్రీ దేవి నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 1న ప్రారంభమవుతున్నాయని ఆయన చెబుతూ, 1వ తేదీ రాత్రి జస్టిస్ ఆశపు రామలింగేశ్వరరావు ఉత్సవ స్టేజీ ప్రారంభిస్తారని, మేయర్ శ్రీమతి పంతం రజనీ శేషసాయి, ఎం ఎల్ ఏ లు డాక్టర్ ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అర్బన్ ఎస్ పి రాజకుమారి, ఎం ఎల్ సిలు శ్రీ సోము వీర్రాజు, ఆదిరెడ్డి అప్పారావు అతిధులుగా పాగొంటారని చెప్పారు.
ప్రతియేటా మాదిరిగానే ఉత్సవాల సందర్బంగా నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశామని శ్రీ ధనరాజు చెప్పారు. 1వ తేదీ రాత్రి కనకదుర్గ మహత్యం,2వ తేదీన ఘంటసాల ఆర్కెస్ట్రా, 3న సత్య హరిశ్చంద్ర నాటకం ఉంటాయి. 4వ తేదీన సమీరా భరద్వాజ్ కాంబినేషన్ లో విశాఖ రోషన్ లాల్ ఆర్కెస్ట్రా,5న మూడు రంగస్థల ఘట్టాలు, 6న మాయాబజార్, 7న సత్య హరిశ్చంద్ర, 8న చింతామణి నాటకం ప్రదర్శిస్తారు, 9న కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుంది. 10న బాలనాగమ్మ నాటకం,11న శ్రీరామాంజనేయ నాటకం,12న కురుక్షేత్రం నాటకం ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాలనీ ఉత్సవకమిటీ అధ్యక్షులు శ్రీ తోలేటి ధనరాజు, కార్యదర్శి శ్రీ పడాల చిన్నబ్బాయ్ కోరారు.

https://www.google.co.in/search?q=rajahmundry+devi+chowk&oq=ra&aqs=chrome.4.69i60l4j69i59j69i57.3307j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv%20raghavarao

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.