నవంబర్ 1న డాక్టర్ ఏబి నాగేశ్వరరావు 117వ జయంతి

dr-ab1-copyab-1

డాక్టర్ తేతలి వెంకటేశ్వరరావుకి సత్కారం

dr-tetali1
అకళంక దేశభక్తులు మాజీ మంత్రి డాక్టర్ ఏబి నాగేశ్వరరావు 117వ జయంతి కార్యక్రమం నవంబర్ 1వ తేదీన నిర్వహించడానికి డాక్టర్ ఎబి జయంతి సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఆరోజు ఉదయం 8గంటలకు కోటగుమ్మం సెంటర్ లోని ఆధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహాలకు ఖద్దరు మాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం గంధం సీతారామాంజనేయులు మార్గ్ (గోదావరి గట్టు) లోని శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘంలో పండ్లు పంపిణీ చేస్తారు. ఆతర్వాత నగరపాలక ఉద్యానవనంలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి ఖద్దరుమాల వేసి నివాళులర్పిస్తారు. 8.30గంటలకు తుమ్మలవలోని డాక్టర్ ఎబి పార్కులో ‘నాటి నాయకత్రయం’ విగ్రహాలకు నివాళులర్పిస్తారు. 9గంటలకు వీరభద్రపురంలోని కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేస్తారు. అలాగే సాదు స్త్రీల మఠంలో పండ్లు పంపిణీ చేస్తారు. ఆతర్వాత సీతంపేటలో డాక్టర్ ఎబి నాగేశ్వరరావు విగ్రహానికి ఖద్దరుమాలా వేసి నివాళులర్పిస్తారు. అనంతరం శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘ కుష్టు రోగుల శరణాలయంలో పండ్లు పంపిణీ చేస్తారు.
అనంతరం 10గంటలకు శ్రీ గౌతమీ ప్రాంతీయ గ్రంధాలయంలో నిర్వహించే సభకు శ్రీ ఫణి నాగేశ్వరరావు స్వాగతం పలుకుతారు. శ్రీ పెరుమాళ్ళ రఘునాధ్ అధ్యక్షత వహిస్తారు. మేయర్ శ్రీమతి పంతం రజనీ శేషసాయి ముఖ్య అతిధిగా పాల్గొంటారు. 34వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి రెడ్డి పార్వతి ప్రియాతిధిగా పాల్గొంటారు. డాక్టర్ ఎబి గురించి డాక్టర్ (మేజర్) చల్లా సత్యవాణి ప్రధాన ప్రసంగం చేస్తారు.

   శ్రీ గాయత్రి క్లినిక్ అధినేత , ప్రభుత్వాసుపత్రి రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ తేతలి వెంకటేశ్వరరావు విశిష్ట అతిధిగా పాల్గొని, సత్కారం అందుకుంటారు. సర్వశ్రీ అశోక్ కుమార్ జైన్ , ఇమంది శ్రీరాములు,తొక్కుల రామాంజనేయులు వక్తలుగా పాల్గొంటారు. శ్రీ మాదిరాజు శ్రీనివాస్ వందన సమర్పణ చేస్తారు.
శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు గౌరవ అధ్యక్షులుగా గల జయంతి సంఘానికి అధ్యక్షులుగా శ్రీ ఇమంది శ్రీరాములు వున్నారు. శ్రీ తొక్కుల రామాంజనేయులు , డాక్టర్ (మేజర్) చల్లా సత్యవాణి ఉపాధ్యక్షులుగా గల ఈ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా శ్రీ జమ్మి రామారావు, కోశాధికారిగా శ్రీ నల్లగొండ రవిప్రకాష్ , సహాయ కార్యదర్శి లుగా శ్రీ ప్రయాగ సుబ్రహ్మణ్యం, శ్రీ మాదిరాజు శ్రీనివాస్, సభ్యులుగా సర్వశ్రీ డాక్టర్ వి ఎల్ ఎన్ శాస్త్రి , సన్నిధానం శాస్త్రి ,వివి రమణారావు, పెరుమాళ్ళ రఘునాధ్, కుమారి కొప్పర్తి దుర్గాదేవి, నందిపల్లి జోగేశ్వరరావు, ఫణి నాగేశ్వరరావు, లాలిశెట్టి అప్పారావు, క్రొవ్విడి సుబ్రహ్మణ్యం,ఫణేంద్ర కుమార్, దేశిరెడ్డి బలరామనాయుడు వ్యవహరిస్తున్నారు.

 

https://www.google.co.in/search?q=raghaveeyam&oq=ra&aqs=chrome.4.69i60l4j69i59l2.5323j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv%20raghavarao

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=Dr.+A.B.+Nageswara+Rao

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.