11న అంత్య పుష్కరాలకు సీఎం రాక .. chief minister will attend for the antya pushkaralu on 11th august

      cm

Jpeg

 

       అంత్య పుష్కరాల ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు ఈనెల 11న నగరానికి వస్తున్నారు. ఈసందర్బంగా సీఎం పలు స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రామకృష్ణ ధియేటర్‌ వెనుక నిర్మించిన 2,250 ప్రభుత్వ గృహాలను లబ్ధిదారులకు సీఎం చేతులమీదుగా అందజేయనున్నారు. ఈ సందర్భంగా హౌసింగ్‌, పంచాయితీరాజ్‌ శాఖ ఇంజనీర్లతో రూరల్‌ ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్యచౌదరి తన నివాసంలో సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. గృహ లబ్ధిదారులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని, 10వ తేదీకల్లా అన్ని పనులు పూర్తి కావాలన్నారు. రూరల్‌ నియోజకవర్గంలో కొత్తగా నాలుగు పంచాయతీ కార్యాలయ భవనాలు నిర్మించాల్సి ఉండగా రెండింటికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. 20 అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించుకోవడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ ఇఇ బి.హెచ్‌.శ్రీనివాస్‌, ఎఇ రాంబాబు, పంచాయతీరాజ్‌శాఖ డిఇ వై.భాస్కరకుమార్‌, ఎఇ ఎం.రాజబాబు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు పాల్గొన్నారు.

  మున్సిపల్ భవన నిర్మాణ పనుల పరిశీలన..

munsipal.2munsipal
కాగా మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవన నిర్మాణం పనులను శ్రీ గోరంట్ల పరిశీలించారు. త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. డిప్యూటీ మేయర్ శ్రీ వాసిరెడ్డి రాంబాబు , కమీషనర్ శ్రీ వి విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు.

 

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=+++chief+minister+arrival+of+the+antya++pushkaralu+

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=municipal+corporation+rajahmundry

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.